Hyderabad: డాక్టర్లు కనిపించరు.. ఇంజక్షన్లు ఉండవు..
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:26 AM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీలో పైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా ఈ ఆసుపత్రికి నేటికీ సొంత భవనం లేదు. అలాగే అరకొర సౌకర్యాలతో, అద్దె భవనంలో నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
- కూకట్‌పల్లి ఈఎస్ఐ డిస్పెన్సరీలో అందని వైద్య సేవలు
- 15ఏళ్లుగా అద్దె భవనంలోనే ఈఎస్ఐ డిస్పెన్సరీ
- ఇబ్బందులు పడుతున్న కార్మికులు, చిరుద్యోగులు
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): ఈఎస్ఐ డిస్పెనరీ అంటే కార్మికులు, చిరుద్యోగులకు నమ్మకమైన వైద్య కేంద్రం. కానీ ఆ నమ్మకానికి తూట్లు పొడుస్తోందని కూకట్‌పల్లి(Kukatpally)లోని ఈఎస్ఐ డిస్పెన్సరీ. 15ఏళ్లుగా కేపీహెచ్‌బీలోని అద్దె భవనంలో ఉంటున్న ఈ కేంద్రం అరకొర వసతుల మధ్య కొనసాగుతోంది. ఎంతో ఆశతో వచ్చే కార్మికులు, చిరుద్యోగులు వైద్య సేవలు అందక నిరుత్సాహంతో వెనక్కి వెళ్లిపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించక తప్పడం లేదు. కనీసం ఇక్కడ డాక్టర్ ఎవరూ అని అడిగిన సమాధానం చెప్పేవారు లేదు. అల్వాల్‌లో ఇన్‌చార్జి ఉంటారని చెప్పడం తప్పా ఇక్కడ బాధ్యతగా వ్యవహరించే అధికారి కనిపించడం లేదు.
పట్టించుకునే వారేరి?
కూకట్‌పల్లి ఈఎ్‌సఐ డిస్పెన్సరీ 2009-10 నుంచి కేపీహెచ్‌బీలో కొనసాగుతోంది. అక్కడ వాహనాల పార్కింగ్ దేవుడెరుగు. కనీసం ఈఎ్‌సఐ ఎక్కడ ఉందో తెలుసుకోవడమూ కష్టమే. గల్లీలోని ఓ నివాస భవనంలోని మొదటి అంతస్తులో కొనసాగుతోంది. ఈ కేంద్రానికి రోజుకు 80-100 మంది రోగులు వస్తుంటారు. కానీ వీరి బాగోగులు పట్టించుకునే నాథుడే లేరు. కేపీహెచ్‌బీ, నిజాంపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, హైదర్‌నగర్ పరిసర ప్రాంతాల రోగులు ఎక్కువగా వస్తుంటారు.

ఆపదలో వైద్యం కోసం వస్తున్న వారికి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎవరూ కూడా డాక్టర్ ఎప్పుడు వస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా వైద్య సేవల కోసం వచ్చిన వారిని ఆ జిరాక్స్ లేదు.. ఈ జిరాక్స్ లేదంటూ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని ఈఎ్‌సఐ లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈఎ్‌సఐ డిస్సెన్సరీని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News