Share News

మునగాకుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.!

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:02 PM

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ ఒకటి. ఇందులో నారింజలో ఉండే విటమిన్ సి, పాలలో ఉండే కాల్షియం, పాలకూరలో ఉండే ఐరన్‌లు ఉంటాయి. మునగాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

మునగాకుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.!
Moringa Leaves Benefits

ఇంటర్నెట్ డెస్క్: మునగ అద్భుతమైన పోషకాలు కలిగిన చెట్టు. ఈ ఆకుల్లో విటమిన్ A,C,Eలతో పాటు కాల్షియం, పొటాషియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని ‘సూపర్ ఫుడ్’ అని అంటారు. మునగలోని ఔషధ గుణాలు అధిక జబ్బులను నయం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఈ చెట్టుకు సంబంధించిన బెరడు, ఆకులు, కాయలు ఇలా ప్రతి ఒక్కటి మంచి ఔషధంగా పనిచేస్తుందట. క్రమం తప్పకుండా మునగ తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.


1.రోగనిరోధక శక్తి:

ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచి, ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

2.మధుమేహం నియంత్రణ:

మధుమేహం ఉన్నవారికి మునగ మంచి ఔషధంగా పనిచేస్తుంది. మునగాకు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. ఇది ఇన్సులిన్ లాంటి ప్రొటీన్లను కలిగి ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్థులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

3. ఎముకల ఆరోగ్యం:

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ వచ్చే ఎముకల బలహీనతను అరికట్టేందుకు మునగాకులోని కాల్షియం, ఫాస్పరస్ ఎంతగానో తోడ్పడతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది సహజమైన మందులా పనిచేస్తుంది.


4. రక్తహీనత నివారణ:

ఐరన్ లోపం ఉన్నవారు మునగాకును చక్కగా వినియోగించుకోవచ్చు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనతను తగ్గిస్తుంది.

5. గుండె ఆరోగ్యం:

మునగాకు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. దీనివల్ల రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉండి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలను తగ్గిస్తుంది.

6. బరువు తగ్గడం:

బరువు తగ్గాలనుకునే వారికి మునగాకు మంచి ఆహారం. ఇది శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడమే కాకుండా, జీవక్రియను వేగవంతం చేస్తుంది.

7. కాలేయ రక్షణ:

మద్యపానం, ధూమపానం వల్ల కాలేయం దెబ్బతిన్నప్పుడు, మునగాకుతో కషాయం చేసుకుని తాగితే చాలా మంచిది. కాలేయంలోని విషతుల్యాలను ఇది బయటకు పంపుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 07 , 2026 | 03:39 PM