తగినంత నిద్ర లేకపోతే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందా.!
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:30 PM
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. నిద్ర లేకపోవడం.. శరీరం, మనసు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. అనేక వ్యాధుల ప్రమాదాన్నీ పెంచుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, మొబైల్ వ్యసనం, మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందికి సరిపడా నిద్ర లేకుండా పోయింది. అందువల్ల ఆలస్యంగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం, నిద్ర సమయాన్ని నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణమైపోయింది. అయితే.. తగినంత నిద్ర(రోజుకు 7-9 గంటలు) లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
నిద్ర లేకపోవడం వల్ల వచ్చే వ్యాధులు
నిద్ర లేకపోవడం కారణంగా రక్తపోటు పెరిగిపోవచ్చు. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక నిద్ర లేమి గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
నిద్రలేమి చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీంతో డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.
నిద్ర లేకపోవడం వలన జీవక్రియ మందగిస్తుంది. దానివల్ల బరువు పెరుగుతారు.
నిద్రలేమి.. ఆందోళన, నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను మరింత పెంచుతుంది.
నిద్రలేమి క్రమంగా రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
బాగా నిద్రపోవాలంటే..
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. పడక గదిని చీకటిగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. పడుకునే ముందు 1-2 గంటల పాటు మొబైల్/టీవీకి దూరంగా ఉండాలి. వీలైనంత వరకూ కెఫీన్(కాఫీ/టీ) వంటి వాటిని తగ్గించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News