రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగితే.. జ్ఞాపకశక్తి మరింత మెరుగుపడుతుందా?
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:16 PM
రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై తాజా అధ్యయనం ఏం చెబుతోంది. 2-3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగేవారు చాలా మంది ఉంటారు. కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదని రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగుతారు. అయితే, రోజూ ఇలా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? 2-3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఏం జరుగుతుంది? ఈ విషయంపై తాజా అధ్యయనం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజా అధ్యయనంలో, రోజుకు 2-3 కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుందని తేలింది. అలా అని.. రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ ఉండవని స్పష్టం చేసింది. 43 సంవత్సరాల వయసున్న 1,31,821 మందిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, 2-3 కప్పుల కాఫీ తాగేవారిలో అభిజ్ఞా సామర్థ్యం మెరుగుపడిందని కనుగొన్నారు. అయితే, కేవలం కెఫిన్ ఉన్న కాఫీ తాగిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం ఉందని, కెఫిన్ లేని కాఫీ తాగిన వారికి ఉండదని స్పష్టం చేసింది.
ఈ అధ్యయనం ప్రకారం, పదేళ్ల పాటు రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగిన వ్యక్తుల్లో చిత్తవైకల్యం (cognitive decline) రాకుండా ఉండే ప్రమాదం 20% తగ్గింది. అలాగే, 1-5 కప్పుల కాఫీ తాగేవారికి చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో మహిళలు, పురుషుల గురించి కూడా సర్వే నిర్వహించారు. 70 ఏళ్లు పైబడిన మహిళలకు కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడిందని తేలింది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News