Share News

మీ ముఖం జిడ్డుగా మారుతోందా? వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

ABN , Publish Date - Mar 13 , 2026 | 08:38 PM

వేసవి మొదలైంది.. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవి కాలాం రాగానే ఎండలు, చెమట వల్ల ముఖం జిడ్డుగా మారడం ఒక ప్రధాన సమస్య. చర్మంపై ఉండే నూనె గ్రంథులు వేడికి అధికంగా ‘సెబమ్’ ను ఉత్పత్తి చేయడం వల్ల ముఖం జిడ్డుగా, నల్లగా, కాంతి విహీనంగా కనిపిస్తుంది.

మీ ముఖం జిడ్డుగా మారుతోందా? వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Oily Skin Solutions

ఇంటర్నె్ట్ డెస్క్: వేసవి మొదలైంది.. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవి కాలాం రాగానే ఎండలు, చెమట వల్ల ముఖం జిడ్డుగా మారడం ఒక ప్రధాన సమస్య. చర్మంపై ఉండే నూనె గ్రంథులు వేడికి అధికంగా ‘సెబమ్’ ను ఉత్పత్తి చేయడం వల్ల ముఖం జిడ్డుగా, నల్లగా, కాంతి విహీనంగా కనిపిస్తుంది. మండే ఎండలకు చర్మాన్ని సంరక్షించు కోవడం చాలా ముఖ్యం. అయితే, సరైన ఆహారం, చర్మ సంరక్షణ పద్ధతులు పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. మనం తీసుకునే ఆహారం మన చర్మంపై నేరుగా ప్రభావం చూపుతుంది. జిడ్డును తగ్గించే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.


ఆహార నియమాలు:

శరీరాన్ని లోపల నుంచి హైడ్రేటెడ్‌గా ఉంచడం వల్ల చర్మం తాజాదనంతో మెరుస్తుంది. ఇందు కోసం ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు తీసుకుంటే చాలా మంచిది. సిట్రస్ పండ్లు అంటే.. నిమ్మ, నారింజ వంటి విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు జిడ్డును నియంత్రించడంలో సహాయపడతాయి.

దోసకాయ, పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు.. చర్మాన్ని తాజాదనంతో మెరిసేలా చేస్తుంది.

తృణ ధాన్యాలు ఫైబర్(పీచు) అధికాంగా ఉండే ఓట్స్ వంటి ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

రోజుకు రెండు సార్లు(ఉదయం, రాత్రి) ఆయిల్-ఫ్రీ ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సాలీసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్‌లు జిడ్డును అదుపు చేయడంలో బాగా పనిచేస్తాయి.

ముఖం కడుక్కున్న తర్వాత రోజ్ వాటర్ (పన్నీరు) వంటి నేచురల్ టోనర్ వాడటం వల్ల చర్మ చంద్రాలు బిగుతుగా మారి జిడ్డు పట్టకుండా ఉంటుంది.

జిడ్డు చర్మం కదా అని మాయిశ్చరైజర్ మానేయకండి. చర్మం తేమను కోల్పోతే మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తోంది. కాబట్టి, వాటర్ లేదా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఎంచుకోండి.

బయటకు వెళ్లే ముందు ఖచ్చితంగా ‘మ్యాటి ఫినిష్’ ఇచ్చే సన్ స్క్రీన్ అప్లై చేయడం మరచిపోవద్దు.

వేసవిలో హెవీ ఫౌండేషన్లు వాడటం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. వీలైంత వరకు లైట్ వెయిట్ లేదా పౌడర్ బేస్డ్ మేకప్ వాడండి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read

వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?

For More Latest News

Updated Date - Mar 13 , 2026 | 08:45 PM