Share News

ఎండలోకి వెళ్లగానే తలనొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి

ABN , Publish Date - Apr 10 , 2026 | 09:34 AM

ఎండలోకి వెళ్లిన వెంటనే తలనొప్పి రావడం చాలా మందిలో కనిపించే సమస్య. చాలా మంది దీనిని సాధారణంగా తీసుకుంటారు. కానీ, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా నివారించాలి? తెలుసుకోవడం చాలా అవసరం.

ఎండలోకి వెళ్లగానే తలనొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి
Headache in Sun Exposure

ఇంటర్నెట్ డెస్క్: ఎండలోకి వెళ్లిన వెంటనే తలనొప్పి రావడం చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. అయితే దీనిని చిన్న విషయంగా తీసుకుని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఏదైనా అసమతుల్యత లేదా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఎండలోకి వెళ్లగానే కొందరికి తల బరువుగా అనిపించడం, కళ్లు మండటం, తల తిరగడం, నీరసం, ఎక్కువగా చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకోవడం, అలసట కూడా వస్తుంది.


తీవ్రమైన ఎండ వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే డీహైడ్రేషన్‌ (శరీరంలో నీటి కొరత) కూడా ప్రధాన కారణం. చెమట ద్వారా నీరు, లవణాలు తగ్గిపోవడంతో తలనొప్పి పెరుగుతుంది. మైగ్రేన్ ఉన్నవారిలో ఎండలోని కాంతి కూడా తలనొప్పిని మరింత పెంచుతుంది. ఖాళీ కడుపుతో బయటకు వెళ్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి తలనొప్పి రావచ్చు. నిద్రలేమి, అలసట కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి.


ఎవరికి ఎక్కువ ప్రమాదం?

మైగ్రేన్ ఉన్నవారు, త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యేవారు, ఎక్కువసేపు ఆకలితో ఉండేవారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు. పిల్లలు, వృద్ధులు,గర్భిణులు, బయట పనిచేసే వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

జాగ్రత్తలు

ఎండలోకి వెళ్లే ముందు నీరు బాగా తాగాలి. తలకు టోపీ, దుపట్టా లేదా గొడుగు ఉపయోగించాలి. కళ్లకు రక్షణగా సన్‌గ్లాసెస్ ధరించడం మంచిది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం తగ్గించాలి. బయటకు వెళ్లే ముందు తేలికైన, శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవాలి. అలాగే వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Apr 10 , 2026 | 10:04 AM