జుట్టు రాలుతోందా? మీ డైట్‌లో ఈ ఆహారాలు ఉంటే చాలు.. సమస్య మాయం!
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:05 PM
జుట్టు రాలడం అనేది చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటి. దీనికోసం నూనెలు, షాంపూలు మార్చడం వల్ల ఫలితం ఉండదు. జుట్టుకు లోపలి నుంచి సరైన పోషణ అందినప్పుడే కుదుళ్లు బలంగా మారతాయి..
ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. కాలుష్యం, మానసిక ఒత్తిడి, పోషకాల లోపం దీనికి ప్రధాన కారణాలు. కేవలం జుట్టుకు రాసే నూనెలు, షాంపూలు మార్చడం వల్ల ఫలితం ఉండదు. లోపలి నుంచి జుట్టుకు సరైన పోషణ అందినప్పుడే కుదుళ్లు బలంగా మారతాయి. జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుతమైన ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.గుడ్లు:
జుట్టు పెరగడానికి బయోటిన్, ప్రోటిన్ చాలా అవసరం. గుడ్లలో ఇవి పుష్కలంగా ఉంటాయి. జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి ఇవి ఎంతో సహాయపడతాయి.
2. పాలకూర:
పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, సి ఉంటాయి. శరీరంలోని ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. పాలకూర తినడం వల్ల కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.
3. కరివేపాకు:
మన ఇంట్లో దొరికే కరివేపాకు జుట్టుకు అమృతం లాంటిది. ఇందులో ఉండే బీటా-కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని తగ్గించి, తెల్ల జుట్టు రాకుండా చేస్తాయి.
4. బాదం-వాల్‌నట్స్:
బాదం, వాల్‌నట్స్‌లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి జుట్టు చిట్లి పోకుండా.. నిగారింపు తెస్తాయి.
5. చిలకడదుంపలు:
ఇందులో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. జుట్టుకు కావాల్సిన సహజసిద్ధమైన నూనెలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
6. ఉసిరికాయ:
ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, తద్వారా జుట్టు దృఢంగా మారుతుంది. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News