ఈ చర్మ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:13 PM
ఇటీవలి కాలంలో మధుమేహం(డయాబెటిస్) కేసులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ వ్యాధి వృద్ధులకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు యువతలోనూ ఎక్కువగా కనిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోవడం వల్ల వచ్చే సమస్య. ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపుతుంది. అందులో చర్మం కూడా ఒకటి. రక్తంలో చక్కెర స్థాయి దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే, శరీరంలో రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. అలాగే చర్మంలో ఉండాల్సిన తేమ శాతం తగ్గిపోతుంది. దీని వల్ల చర్మం తన సహజ రక్షణ శక్తిని కోల్పోయి, అనేక చర్మ సమస్యలు మొదలవుతాయి. చాలామంది ఈ లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి పట్టించుకోరు. కానీ ఇవి మధుమేహానికి ముందస్తు హెచ్చరికలుగా ఉండొచ్చు. అందుకే వీటిని గుర్తించడం చాలా అవసరం.
చర్మంలో కనిపించే మార్పులు మధుమేహానికి సంకేతాలా?
మధుమేహం ఉన్నవారిలో చర్మంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
చర్మం ఎక్కువగా పొడిబారడం
తరచూ దురద లేదా మంటలు రావడం
మెడ చుట్టూ నల్లటి మచ్చలు రావడం
చిన్న గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడటం
తరచూ ఫంగల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావడం
పూతలు, మొటిమలు లేదా చర్మంపై ఎర్రగా మారడం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో చక్కెర స్థాయిలు సరిగా లేవని అర్థం.
ఈ సమస్యను ఎలా నివారించాలి?
చర్మంలో ఇలాంటి మార్పులు కనిపిస్తే ముందుగా రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకోండి.
మధుమేహాన్ని నియంత్రించేందుకు సమతుల్యమైన ఆహారం తీసుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
డాక్టర్ సూచించిన మందులను సరిగ్గా వాడండి.
చర్మాన్ని శుభ్రంగా, తేమగా ఉంచుకోండి.
ఎక్కువ రసాయనాలు ఉన్న సబ్బులు, క్రీములు వాడకండి.
చర్మానికి అనుకూలమైన ఉత్పత్తులనే ఉపయోగించండి.
గాయాలు లేదా ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
చర్మం ద్వారా శరీరం తనలో ఉన్న సమస్యలను ముందే తెలియజేస్తుంది.
కాబట్టి చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News