కుక్క కరిచిన వెంటనే ఇలా చేయండి.. లేకుంటే ప్రమాదమే!
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:09 PM
ప్రమాదవశాత్తు కుక్క కాటుకు గురైతే వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే ఈ విషయంలో కొందరు నిర్లక్ష్యం చేసి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బయటకు రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు కుక్క కాటుకు గురైతే వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే ఈ విషయంలో కొందరు నిర్లక్ష్యం చేసి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలో వివరించేందుకే ఈ ప్రత్యేక కథనం.
కుక్క కరిచిన వెంటనే ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకుని తీరాలని వైద్యులు చెబుతున్నారు. మొదట కుక్క కరిచిన చోట గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల వైరస్ తీవ్రత కాస్త తగ్గుతుంది. ఆ గాయంపై ఎలాంటి బ్యాండేజీలు వేయకూడదు. తరువాత ఆసుపత్రికి వెళ్లి మొదటి డోసు రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కుక్క కరిచిన 24 గంటలలోపు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌ను వైద్యులు నాలుగు డోసులుగా అందిస్తారు. కుక్క కరిచిన రోజు మొదటి డోసు, 3వ రోజు రెండో డోసు, 7వ రోజు మూడో డోసు, 14వ రోజు నాలుగో డోసు వేసుకోవాలి.
పథ్యం ఏమన్నా ఉందా?
కుక్క కాటుకు గురైన వారు పథ్యం పాటించాలా అని సందేహాలు వ్యక్తం చేస్తారు. ఇలాంటి వారికి ప్రత్యేక పథ్యమంటూ ఏమీ లేదు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో మాత్రం ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కారం, మసాలాలను తీసుకోకూడదు. మద్యం సేవించకపోవడం అన్నివిధాల శ్రేయస్కరం.
ఈ వార్తలూ చదవండి
బాబోయ్.. ఉసిరి రసం తాగితే ఇన్ని లాభాలా..!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ 4 కూరగాయలు ట్రై చేయండి..