యాలకులు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. తెలిస్తే అస్సలు వదలరు..
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:46 PM
భారతీయ వంటకాల్లో యాలకులకు ఎంతో ప్రత్యేకత ఉంది. యాలకులు రుచి, సువాసనను ఇవ్వడంతో పాటు జీర్ణక్రియనూ మెరుగుపరుస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: యాలకులు(Cardamom) మంచి సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు.. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. అందుకే యాలకులను ‘సుగంధ ద్రవ్యాల రాణి’గా పిలుస్తారు. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
యాలకులు జీర్ణశక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. భోజనం తర్వాత ఒక యాలక గింజ నమలడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవొచ్చు. కండుపులో మంటనూ తగ్గిస్తుంది.
2. నోటి ఆరోగ్యం కాపాడుతుంది:
యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, దుర్వాసనను పోగొడతాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి.
3. గుండె ఆరోగ్యానికి మేలు:
యాలకులు రక్తపోటును కంట్రోల్ చేయడంలో సాయపడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను చాలావరకు తగ్గిస్తాయి.
4. శ్వాసకోస ఇబ్బందుల నుంచి ఉపశమనం:
తరుచూ వచ్చే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి ఇబ్బందులతో బాధపడేవారికి యాలకులు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని మెరుగుపరిచి ఈజీగా శ్వాస తీసుకునేలా చేస్తుంది.
5. డిప్రేషన్ దూరం:
ఇటీవల కాలంలో చాలామంది తమ పనుల వల్ల ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అలాంటివారు యాలకుల టీ లేదా యాలకులు నోట్లో వేసుకుని నమిలితే మనుసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.