Share News

మౌత్‌వాష్ అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందా?

ABN , Publish Date - Apr 21 , 2026 | 05:23 PM

మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం పెరగవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. నోటిలోని మంచి బ్యాక్టీరియాను ఇది నశించేలా చేసి, రక్తపోటు నియంత్రణపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మౌత్‌వాష్ అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందా?
Mouthwash And High Blood Pressure

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది నోటి పరిశుభ్రత కోసం మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో దీని వినియోగం పెరిగింది. అయితే మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) వచ్చే ప్రమాదం పెరగవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.


పరిశోధనల ప్రకారం, మన నోటిలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సడలించి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ బలమైన యాంటీబ్యాక్టీరియల్ మౌత్‌వాష్‌లు ఈ మంచి బ్యాక్టీరియాను కూడా నశించేలా చేస్తాయి. దీని వల్ల నైట్రిక్ ఆక్సైడ్ స్థాయులు తగ్గి, రక్తపోటు పెరగే అవకాశం ఉంటుంది.

మౌత్‌వాష్‌ ప్రమాదకరమా?

మౌత్‌వాష్ ప్రమాదకరం కాదు. బలమైన రసాయనాలు ఉన్న మౌత్‌వాష్‌లను అధికంగా వాడితేనే ప్రమాదం. తక్కువ రసాయనాలు ఉన్నవి లేదా డాక్టర్ సూచించినవి పరిమితంగా వాడితే సాధారణంగా ప్రమాదం ఉండదు. పరిశోధనల ప్రకారం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడితే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ రోజుకు పలుమార్లు వాడితే మంచి బ్యాక్టీరియా తగ్గి హై బీపీ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


జాగ్రత్తలు

  • రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి.

  • ఏడాదికి కనీసం ఒకసారి దంత పరీక్ష చేయించుకోవాలి.

  • మౌత్‌వాష్‌ను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.

మౌత్‌వాష్‌ను మితంగా వాడితే ప్రయోజనం ఉంటుంది. కానీ అధికంగా వాడటం వల్ల అనవసర ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 05:41 PM