Share News

మధుమేహం ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా?

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:09 PM

మధుమేహం ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సహజంగా తీపి రుచి ఉన్న ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు.

మధుమేహం ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా?
Can Diabetics Eat Watermelon

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయలో సుమారు 90% నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి అవసరమైన తేమను అందించి, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలోని గుణాలు శరీర వేడిని తగ్గించి, ఎండల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది అలసటను తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులో విటమిన్ A, సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా అలర్జీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.


అయితే, మధుమేహం ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సహజంగా తీపి రుచి ఉన్న ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. అయితే నిపుణుల ప్రకారం సరైన పరిమాణంలో తీసుకుంటే పుచ్చకాయ శరీరానికి హైడ్రేషన్ అందించడమే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. అయితే.. దీనిని ఎలా, ఎంత పరిమాణంలో తినాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.


మధుమేహులు పుచ్చకాయ తినవచ్చా?

పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను మితంగా (చిన్న కప్పు పరిమాణంలో) తినవచ్చు. అయితే పుచ్చకాయ రసం తాగడం మంచిది కాదు, ఎందుకంటే అది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవచ్చు. మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని మితంగా తీసుకోవడం మంచిది. అవసరమైతే వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 19 , 2026 | 05:09 PM