పడుకునే ముందు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
ABN , Publish Date - Apr 18 , 2026 | 08:09 PM
రాత్రిపూట మనం తీసుకునే ఆహారం నిద్ర నాణ్యతపై కీలక ప్రభావం చూపుతుంది. అనారోగ్యకరమైన లేదా భారమైన ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి బిజీ జీవితంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రిపూట కొన్ని ఆహారాలను తీసుకోవడం మానుకుంటే మంచి నిద్ర పొందవచ్చు.
కెఫీన్ ఉన్నవి:
కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు వంటి వాటిలో కెఫీన్ ఉంటుంది. ఇవి మెదడును చురుకుగా ఉంచి నిద్ర పట్టకుండా చేస్తాయి.
మసాలా, వేయించిన ఆహారం:
మసాలా, వేయించిన ఆహారం తింటే కడుపులో మంట, ఎసిడిటీ కలుగుతుంది. దీంతో నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. పిజ్జా, బర్గర్, మటన్ వంటి ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో నిద్రలో అంతరాయం కలుగుతుంది.
చక్కెర పదార్థాలు:
కేకులు, స్వీట్లు తింటే రక్తంలో చక్కెర పెరిగి నిద్ర భంగం కలుగుతుంది.
ఆమ్ల గుణం ఉన్న ఆహారం:
నిమ్మకాయ, నారింజ, టమోటా వంటి వాటిని రాత్రిపూట తింటే గుండెల్లో మంట కలుగుతుంది. అలాగే, బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ తింటే కడుపులో గ్యాస్ ఏర్పడి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
మద్యం:
మద్యం తాగితే మొదట నిద్ర వచ్చినట్టు అనిపించినా, తర్వాత నిద్ర సరిగా ఉండదు. మంచి నిద్ర కావాలంటే రాత్రిపూట తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పై చెప్పిన ఆహారాలను నివారిస్తే మంచి నిద్రతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
For More Latest News