డయాబెటిస్, హై బీపీ ఉన్నవారికి వినికిడి లోపం వస్తుందా?
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:31 PM
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే అది శరీరంలోని అనేక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చక్కెర నియంత్రణలో లేకపోవడానికి కారణాలు ఏమిటి? దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: డయాబెటిస్ (మధుమేహం), అధిక రక్తపోటు (హై బీపీ) రెండూ ప్రమాదకరమైన వ్యాధులు. ఇవి గుండె, కిడ్నీలు, కళ్లపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలిసిందే. కానీ ఇవి వినికిడి సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల ప్రకారం కొంతమందిలో డయాబెటిస్, హై బీపీ కారణంగా వినికిడి సమస్యలు రావచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే, శరీరంలోని నరాలు దెబ్బతింటాయి. చెవిలోని శ్రవణ నరాలు కూడా ప్రభావితమవుతాయి. దీని వల్ల శబ్దాలు స్పష్టంగా వినిపించకపోవచ్చు. ఎక్కువ కాలం రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో లేకపోవడం, వృద్ధాప్యం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది.
హై బీపీ వల్ల వినికిడి లోపం వస్తుందా?
సాధారణంగా హై బీపీ వల్ల వినికిడి సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే లేదా నియంత్రణలో లేకపోతే, ఆకస్మిక వినికిడి లోపం (Sudden Hearing Loss) వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్, హై బీపీ రెండూ కలిపి ఉంటే ప్రమాదం మరింత పెరుగుతుంది.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి..
మాట్లాడేటప్పుడు స్పష్టంగా వినిపించకపోవడం.
ఫోన్‌లో శబ్దం బాగా వినిపించకపోవడం.
చెవుల్లో మోగుతున్న శబ్దం (టిన్నిటస్).
టీవీ లేదా ఫోన్ వాల్యూమ్ ఎక్కువగా పెట్టాల్సి రావడం.
ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ENT వైద్యుడిని సంప్రదించాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే మందులు, చికిత్సతో సమస్యను నియంత్రించవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News