Share News

మందులు తీసుకున్నా బీపీ ఎక్కువగానే ఉంటుందా?

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:02 PM

అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడానికి చాలామంది మందులు తీసుకుంటారు. అయితే కొంతమందికి మందులు తీసుకున్న తర్వాత కూడా బీపీ ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో, దాన్ని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మందులు తీసుకున్నా బీపీ ఎక్కువగానే ఉంటుందా?
High Blood Pressure Causes

ఇంటర్నెట్ డెస్క్: అధిక రక్తపోటు (బీపీ) ఒక ప్రమాదకరమైన సమస్య. దీన్ని నియంత్రించడానికి చాలా మంది మందులు తీసుకుంటారు. అతే కొందరికి మందులు తీసుకున్న తర్వాత కూడా బీపీ పెరుగుతుంటుంది. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు సమస్య ఎక్కువైంది. ఇది మెదడు స్ట్రోక్, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. సాధారణంగా మందులు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో.. మందులు తీసుకున్నా కూడా బీపీ పెరగొచ్చు.

మందులు తీసుకున్నా బీపీ ఎందుకు పెరుగుతుంది?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, చాలా మంది తమ మందులను నిర్దిష్ట సమయానికి తీసుకోరు. ఒక రోజు ఉదయం, మరొక రోజు సాయంత్రం.. ఇలా సమయాన్ని మార్చడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. అలాగే, కొందరు వైద్యుల సూచన లేకుండా తమ మోతాదును స్వయంగా మార్చుకుంటారు. ఇది ప్రమాదకరం. ఎప్పుడూ డాక్టర్ చెప్పిన సమయానికి, చెప్పిన మోతాదులోనే మందులు తీసుకోవాలి.


ఆహార విషయంలో చేసే పొరపాట్లు..

  • ఎక్కువగా ఉప్పు తీసుకోవడం బీపీ పెరగడానికి ప్రధాన కారణం.

  • ఊరగాయలు, అప్పడాలు, ఉప్పుగా ఉండే పదార్థాలు తగ్గించాలి.

  • ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆహారాలు తగ్గించాలి.

  • ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి.

  • రాత్రిళ్లు ఆలస్యంగా, ఎక్కువగా తినడం మానుకోవాలి.


జీవనశైలిలో జాగ్రత్తలు..

  • రోజూ ఒకే సమయంలో మందులు తీసుకోవాలి.

  • రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి.

  • ఒత్తిడిని తగ్గించుకోవాలి.

  • బరువును నియంత్రించుకోవాలి.

  • రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు.


మంచి జీవనశైలి, సరైన ఆహారం, వైద్యుల సూచనలు పాటిస్తే బీపీని సులభంగా నియంత్రించవచ్చు. మందులు తీసుకుంటూ కూడా బీపీ ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 08 , 2026 | 01:45 PM