Beetroot: బీట్‌రూట్‌తో ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదలరు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 09:34 PM
బీట్‌రూట్ సర్వరోగ నివారిణి అంటారు. ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. అద్భుతమైన పోషకాలు లభిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: బీట్‌రూట్( Beetroot) ముదురు ఎరుపు రంగులో ఉండే ఒక దుంప కూరగాయ. ఇది పోషకాల(Nutrients)తో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఫోలెట్, ఐరన్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
1. రక్త హీనతకు విరుగుడు(Anemia Prevention):
బీట్‌రూట్‌లో ఐరన్ (Iron) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి, హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. రక్త హీనతతో బాధపడేవారికి ఇది గొప్ప వరం అనొచ్చు.
2. బీపీ నియంత్రణ (Controls Blood Pressure):
ఇందులో ఉండే సహజసిద్ధమైన నైట్రేట్లు శరీరంలో చేరాక ‘నైట్రిక్ ఆక్సైడ్’గా మారుతాయి. ఇది రక్తనాళాలను వెడల్పు చేసి, రక్త ప్రసరణను సులభతరం చేస్తాయి. తద్వారా అధిక రక్తపోటు (High BP) తగ్గుతుంది.
3. స్టామినా పెరుగుతుంది (Boosts Stamina):
ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు, జిమ్ కి వెళ్లేవారు జ్యూస్ తాగితే శరీరానికి ఆక్సీజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఇది త్వరగా అలసిపోకుండా చూస్తుంది, శక్తిని పెంచుతుంది.
4. గుండె ఆరోగ్యానికి (Heart Health):
బీట్‌రూట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెపోటు (Heart Attack) రాకుండా కాపాడుతుంది.
5. మెరిసే చర్మం (Glowing Skin):
బీట్‌రూట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీని వల్ల ముఖంపై మొటిమలు తగ్గి ప్రకాశవంతంగా, అందంగా మారుతుంది. దీనిలో విటమిన్-సి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.
6. జీర్ణక్రియ మెరుగుపడుతుంది (Improves Digestion):
ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కవగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం(Constipation) సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. నొప్పులను తగ్గిస్తుంది:
బీట్‌రూట్ లో బీటాలైన్లు ఉంటాయి. ఇవి శక్తవంతమైన యాంటీఆక్సిడెంట్ల లక్షణాలు కలిగిఉంటాయి. ఇది ఎలాంటి నొప్పులనైనా ఇట్టే తగ్గిస్తాయి.
8 కాలేయ ఆరోగ్యం (Liver health):
ఇది కాలేయ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. బీటాలైన్లు అధిక కొవ్వు పేరుకుపోవడానికి నివారిస్తాయి. బీట్ రూట్ జ్యూస్ తాగటం వల్ల హానికరమైన కొవ్వు పేరుకుపోకుండా మెరుగుపరుస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News