Share News

బిర్యానీ ఆకు కేవలం సువాసనకే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:42 PM

మనం వంటల్లో వాడే బిర్యానీకి కేవలం రుచి, సువానే కాదు, దానిలో అద్బుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. బిర్యానీ ఆకుతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.. అవి ఏంటో చూద్దాం.

బిర్యానీ ఆకు కేవలం సువాసనకే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది
Bay Leaf Health Benefits

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటగదిలో మసాలా దినుసులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందులోనూ బిర్యానీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ ఆకు (Bay Leaf). బిర్యానీ, పులావ్‌లో రుచీ, సువాసనకు బిర్యానీ ఆకు తప్పకుండా వాడుతారు. ఈ చిన్న ఆకులో గుమ గుమలాడే సువాసనే కాదు, అద్భుతమైన ఔషద గుణాలు కూడా ఉన్నాయి.. దీన్ని పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు.


1. జీర్ణ వ్యవస్థకు ప్రాణవాయువు:

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య అజీర్ణం. బిర్యానీ ఆకులో ఉండే కొన్ని రకాల ఎంజైమ్‌లు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. అందుకే ఫంక్షన్స్ లో తినే భోజనాల్లో బిర్యానీ ఆకు తన్పకుండా ఉండాల్సిందే.

2. మధుమేహానికి సహజ ఔషధం:

రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బిర్యానీ ఆకు అద్భతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. టైప్ - 2 మధుమేహంతో బాధపడేవారికి తమ ఆహారంలో ఈ ఆకును క్రమంగా చేర్చుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

3. గుండె ఆరోగ్యం:

మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ‘రుటిన్’, ‘కాఫిక్ యాసిడ్’ వంటి పోషకాలు బిర్యానీ ఆకులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండె రక్తనాళాలను బలోపేతం చేస్తాయి. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

4.ఒత్తిడిని తగ్గిస్తుంది:

నేటి సమాజంలో చాలా మందికి మానసిక ఒత్తిడి సాధారణమైపోయింది. బిర్యానీ ఆకులో ఉండే ‘లైనాలూల్’ అనే పదార్థం ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తుంది. రాత్రిపూట బిర్యానీ ఆకు వేసిన టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా మారి, హాయిగా నిద్ర పడుతుంది.

5.కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం:

బిర్యానీ ఆకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (వాపు నిరోధక) గుణాలు ఉన్నాయి. దీని నుంచి తీసిన నూనెను కీళ్ల నొప్పులు లేదా బెణుకులు ఉన్న చోట రాస్తే నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.


Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 08 , 2026 | 05:22 PM