తరచూ కోపంగా ఉంటున్నారా? గుండెపోటు ప్రమాదం 5 రెట్లు పెరుగుతుంది.!
ABN , Publish Date - Feb 18 , 2026 | 03:34 PM
తరచుగా కోపంగా ఉండటం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన కోపం వల్ల గుండెపోటు ప్రమాదం 5 రెట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. జీవనశైలి, ఆహారం, ఒత్తిడి వంటి అనేక కారణాలు దీనికి కారణమవుతున్నాయి. అయితే, తరచుగా కోపంగా ఉండటం కూడా గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
తాజా అధ్యయనం ప్రకారం, అకస్మాత్తుగా తీవ్రమైన కోపం వచ్చిన తర్వాత రెండు గంటలలో గుండెపోటు వచ్చే ప్రమాదం దాదాపు 5 రెట్లు పెరుగుతుంది. అలాగే 2014లో ఓ పరిశోధనలో కూడా తరచుగా కోపంగా ఉండే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. గుండె జబ్బులు లేకపోయినా తరచుగా కోపంగా ఉండే పురుషుల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన కోపం గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
కోపం గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది?
కోపం వచ్చినప్పుడు శరీరంలో కాటెకోలమైన్స్ అనే ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఇవి రక్తపోటును ఒక్కసారిగా పెంచుతాయి. రక్తపోటు పెరగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికమవుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, తీవ్రమైన కోపం సమయంలో ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే పరిస్థితి ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుంది. ఈ ప్రమాదం పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర గుండె జబ్బులు లేకపోయినా, తరచూ కోపం వచ్చే వ్యక్తులకు గుండెపోటు ప్రమాదం 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అధిక కొలెస్ట్రాల్ లాగా, కోపం కూడా గుండెపోటుకు ప్రధాన ప్రమాద కారకంగా గుర్తించారు.
గుండెను రక్షించుకోవడానికి ఏం చేయాలి?
ప్రతిరోజూ యోగా లేదా ధ్యానం చేయాలి.
ఒత్తిడిని తగ్గించే అలవాట్లు అలవరుచుకోవాలి.
కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఉండాలి.
అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.
కోపాన్ని నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ప్రశాంతమైన మనసు.. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఇవి చాలా ముఖ్యం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News