Share News

స్కూలు బస్సు భద్రమేనా..

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:42 AM

కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జూన్‌ 12 నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి.

స్కూలు బస్సు భద్రమేనా..
Private School Bus

  • వాహనాల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన

  • 15 నుంచి ప్రారంభం కానున్న బడులు

  • నిబంధనలు పాటించాలంటున్న అధికారులు

  • 36 బస్సుల ఫిట్‌నెస్‌ పెండింగ్‌

జనగామ: కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జూన్‌ 12 నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్ల బస్సుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని వాపోతున్నారు. జిల్లాలో 91 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 211 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన బడి బస్సులున్నాయి. ఇప్పటి వరకు 175 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ జరిగింది. ఇంకా 36 బస్సుల ఫిట్‌నెస్‌ పెండింగ్‌లో ఉంది. ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాల యాజమాన్యాలు ఫీజులపై ఉన్న శ్రద్ధ, బస్సుల ఫిట్‌నెస్‌పై కూడా ఉండాలని పేర్కొంటున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదానికి దారి తీసే అవకాశముందని వాపోతున్నారు.


నిబంధనలు అతిక్రమించొద్దు..

స్కూల్‌ బస్సుకు పాఠశాల పేరు, ఫోన్‌ నెంబర్‌, చిరునామా, బస్సు ఎడమ వైపు పూర్తిగా కనిపించేలా ఉండాలి. వాహనాలు తప్పనిసరిగా పూర్తి కండీషన్‌లో ఉండాలని అధికారులు పేర్కొం టున్నారు. బస్సు, వ్యాన్‌కు రెండు వైపులా మిర్రర్స్‌ ఉండాలని, డ్రైవర్‌ వయస్సు 60ఏళ్లకు మించరాదని పేర్కొంటున్నారు. తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని, డ్రైవర్లు మూడు నెలలకోసారి షుగర్‌, బీపీ, గుండె పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, ప్రతీ బస్సుకు ఒక అటెండర్‌ ఉండా లని, బస్సులో అగ్నిప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉండాలని పేర్కొంటున్నారు. ఎమర్జెన్సీ ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, అగ్నిమాపక యంత్రం తప్పనిసరిగా వెల్లడిస్తున్నారు.


hnk2.2.jpgజాగ్రత్తలు పాటించాలి..

  • విద్యార్థులను తీసుకొచ్చే వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయాలి.

  • పాఠశాల ఉన్న ప్రాంతంలో రహదారిపై స్కూల్‌ జోన్‌ సైన్‌ బోర్డులు, రహదారి పై ప్రత్యేక రంగులు వేయించాలి.

  • విద్యార్థులున్నారనే సంకేతాన్ని వాహనాల డ్రైవర్లు దూరం నుంచే గుర్తించేలా పిల్లల ఛాయాచిత్రాలతో బోర్డులు ఏర్పాటు చేయాలి.

  • తరగతుల ప్రారంభం, ముగింపు సమయాల్లో రహదారిపై గేటు వద్ద రద్దీ సమస్య లేకుండా చూడాలి.

  • పిల్లలు, వారి తల్లిదండ్రులు రోడ్డు దాటేలా జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలి.


ఫిట్‌నెస్‌ లేని బస్సులు రోడ్డుపై తిరిగితే చర్యలు

  • ఎం.శిల్ప, డీటీవో, జనగామ

స్కూల్‌ బస్సులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వ హిస్తాం. ఫిట్‌నెస్‌ లేకుండా తిరిగే స్కూల్‌ బస్సుల యాజమా న్యాలపై కఠినచర్యలు తీసుకుంటాం. ప్రైవేటు పాఠశాలల బస్సులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. భద్రతా ప్రమాణాలు పాటి స్తూ పాఠశాలల బస్సులు నడపాలి. అనుభవం ఉన్న డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా బస్సుల స్థితిపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని పాఠశాలల యాజమాన్యాలకు రీమార్కులు తెలియజేయాలి. ప్రమాదా లు జరుగకుండా పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు, తల్లిదండ్రు లు జాగ్రత్తలు తీసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 11:42 AM