మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Jun 13 , 2026 | 10:29 AM
ఈ రోజు (శనివారం) కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 500 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 450 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 370 రూపాయలు పెరిగింది.
ఇంటర్‌నెట్, జూన్ 13: పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా తిరోగమనంలో ఉన్న బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి భారీగా పెరుగుతున్నాయి. నిన్న (శుక్రవారం)10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,940 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 2,700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 2210 రూపాయలు పెరిగింది. ఈ రోజు (శనివారం) కూడా బంగారం ధరలు పెరిగాయి.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 500 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 450 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 370 రూపాయలు పెరిగింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,49,080 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,36,650 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,11,810 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు..
ఈ రోజు 100 గ్రాముల వెండిపై 500 రూపాయలు.. కేజీ వెండిపై 5000 రూపాయలు పెరిగింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 27,000 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,70,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయి: రాంచందర్ రావు
వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర