Share News

ఉగాది రోజు ఇలా చేస్తే.. మీ ఇంట ఐశ్వరమే..

ABN , Publish Date - Mar 17 , 2026 | 07:58 AM

ఉగాది రోజు ఏం చేస్తే.. ఏడాదంతా అదే జరుగుతుందనే ఒక భావన తెలుగు ప్రజలలో బలంగా ఉంది. గతేడాది కొంత కష్టంగా ఉంది. ఈ ఏడాది అయినా బాగుంటుందా? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

ఉగాది రోజు ఇలా చేస్తే.. మీ ఇంట ఐశ్వరమే..

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని మార్చి 19వ తేదీ గురువారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజు ఏం చేస్తే.. ఏడాదంతా అదే జరుగుతుందనే ఒక భావన తెలుగు ప్రజలలో బలంగా ఉంది. గతేడాది కొంత కష్టంగా ఉంది. ఈ ఏడాది అయినా బాగుంటుందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఉగాది పర్వదినం వేళ.. ఇలా చేయడం వల్ల ఏడాదంతా శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగి.. ఆనందంగా ఉండొచ్చని అంటున్నారు.


ఉగాది పండగ రోజు ఇలా..

  • పండగ రోజు త్వరగా నిద్ర లేచి తల స్నానం చేయాలి.

  • ఇంటిని శుభ్రం చేసి ద్వార గుమ్మానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. ఇలా చేయడం వల్ల శుభం, ఐశ్వర్యం కలుగుతాయి.

  • కావాల్సిన పదార్థాలు తెచ్చుకుని.. ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి.

  • దేవుని గదిలో లేకుంటే దేవుని ఫొటో ముందు ఆ పచ్చడిని నైవేద్యంగా సమర్పించాలి. పూజా కార్యక్రమాలు ముగించాలి.


  • ఉగాది పచ్చడిని స్వీకరించాలి. జీవితంలో ఆరు రుచులను స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.

  • కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది.. గ్రహాల ప్రభావం ఏ రాశుల మీద ఎలా ఉందనేది పండితుల ద్వారా తెలుసుకోవచ్చు. పంచాంగ శ్రవణం వినవచ్చు.

  • ఈ పండగ రోజు.. దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే కుటుంబానికి శుభం కలుగుతుందని పండితులు చెబుతారు.


  • ఈ రోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, విజయాలు కలుగుతాయి.

  • ఉగాది వేళ.. మీకు తొచిన వాటిని దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అన్నదానం, వస్త్రదానం ఇలా ఏదైనా చేయవచ్చు.

  • ఉగాది రోజు కొత్త పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఉండవు.

  • కొత్త ఏడాది మంచి ఆలోచనలతో ప్రారంభించాలి. ఉగాది నుంచి ఈ ఏడాది అంతా బాగా కలిసి రావాలని మనస్సులో సంకల్పం చెప్పుకొని.. కొత్త పనులు ప్రారంభించాలి.


ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పిస్తే శుభం కలుగుతుంది. ఎర్రటి పుష్పాలను సమర్పిస్తే.. శుభ ఫలితాలు కలుగుతాయి. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు. ఈ రోజు ఓం గం గణపతయే నమ: అంటూ సాధ్యమైనన్ని సార్లు ఈ మంత్రాన్ని స్మరణ చేసుకోవాలి. ఉగాది రోజు ఇలా చేయడం వల్ల ఏడాదంతా ఐశ్వర్యం, ఆనందం, శుభాలు కలుగుతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కొత్త అమావాస్య వేళ.. పొరపాటున కూడా ఇలా చేయవద్దు?

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు

For More Devotional News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 08:56 AM