Share News

నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ

ABN , Publish Date - Aug 16 , 2026 | 09:29 AM

తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, ఆర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల నవంబర్ కోటా విడుదలకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది.

నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ

తిరుమల, ఆగస్టు 16: తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, ఆర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల నవంబర్ కోటా విడుదలకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 18వ తేదీ ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ కోటాను విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10.00 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు నగదు చెల్లించి లక్కీడిప్ టికెట్లు పొందాల్సి ఉంటుంది.


ఆగస్టు 21వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు విడుదల చేయనున్నారు.


ఆగస్టు 24వ తేదీ ఉదయం 10.00 గంటలకు అంగప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటా, మధ్యాహ్నం 3.00 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.


ఆగస్టు 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శనం రూ. 300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in/వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆగస్టు 17న నాగ పంచమి.. సుబ్రహ్మణ్యస్వామిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు!

చాక్లెట్ లాక్కుందని తల్లిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 09:40 AM