భక్తికి మార్గం ‘రోజా’
ABN , Publish Date - Feb 26 , 2026 | 09:40 AM
సంవత్సరంలోని 12 నెలల్లో పవిత్రమైన రంజాన్ మాసానికి విశేష ప్రాముఖ్యత ఉంది. పవిత్ర గ్రంథమైన ఖురాన్ ప్రకారం ఉపవాస దీక్షలు పాటించడం ఆరోగ్యానికి మంచిదేనని గ్రంథాలు తెలుపుతున్నాయి.
హైదరాబాద్: సంవత్సరంలోని 12 నెలల్లో పవిత్రమైన రంజాన్ మాసానికి విశేష ప్రాముఖ్యత ఉంది. పవిత్ర గ్రంథమైన ఖురాన్ ప్రకారం ఉపవాస దీక్షలు పాటించడం ఆరోగ్యానికి మంచిదేనని గ్రంథాలు తెలుపుతున్నాయి. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసదీక్షలు చేపట్టడడంవల్ల ఎంతో పుణ్యం, మంచి ఆరోగ్యంగా ఉంటామని ఇస్లామిక్ గ్రంథాలు పేర్కొంటున్నాయి. సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణకోశ సంబంధ వ్యాధులు దూరమవుతాయని ప్రకృతి వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
సూర్యోదయానికి ముందు ఆహారం తీసుకోవడంలోనే ఆరోగ్యం దాగి వుందని ఇస్లాం బోధిస్తుంది. మహ్మద్ ప్రవక్త కూడా ప్రాతఃకాలానికి ముందే ఆహారాన్ని స్వీకరించేవారని ఆయన అనుచరులు ఎన్నో హదీసులలో వివరించారు. ఉపవాస వ్రతం రోజా ఈ మాసంలోనే విధిగా నిర్ణయించబంది. వేయి మాసాలకన్నా అత్యంత విలువైన రాత్రి లైలతుల్ ఖద్ర్ మానవాళి మార్గదర్శనం కోసం దైవం పంపిన పవిత్ర గ్రంథం ఖురాన్ కూడా ఈ మాసంలోనే అవతరించింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రంజాన్ మాసం రోజాలు ఉండేవారికి అంత పుణ్యం ఉంటుందని ఇస్లామిక్ గ్రంథాలు తెలుపుతున్నాయి.
భక్తిని పెంచే ఉపవాసం
రోజావల్ల మానవులను మంచివారుగా సౌశీల్యవంతులుగా, దైవభీతి గలవారుగా తీర్చిదిద్ద డం, దీనివల్ల భక్తిని పెంచే అవకాశం ఉంది. ప్రాజ్ఞత వచ్చిన స్త్రీ పురుషులందరూ రోజా వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని దేవుడు ఆదేశించాడు. ఎవరైనా దీన్ని తిరస్కరిస్తే మతభ్రష్టులు, మార్గభ్రష్టులు అయ్యే అవకాశముంది. మానవుల బలహీనతలను, వారి కష్టసుఖాలను బాగా తెలిసిన దేవుడు ఉపవాసాలను విధిగా చేసినప్పటికీ కొందరికి కొన్ని మినహాయింపులు కూడా ప్రసాదించారు. చిన్నపిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, మతిస్థిమితంలేని వారు అపరిశుద్ధావస్తలో ఉన్న స్త్రీలు ఉపవాసవ్రతం నుంచి మినహాయింపు ఉంది.
రోజావల్ల జీర్ణకోశ వ్యాధులు దూరం సహర్, ఇఫ్తార్ వేళలో ఆహారాన్ని తీసుకోవడంలో ఎన్నో శాస్త్రీయ కారణాలు కనిపిస్తున్నాయి. రుషులు, సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని తీసుకునేవారని, ఉద యం, సాయంత్రం వేళల్లో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి. తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణమవుతుందని, జీర్ణశక్తి పెరుగుతుందని, దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోజా సమయంలో ఎక్కువగా పండ్లు ఫలాలు (ఖర్జూ ర) తీసుకుంటారని వీటిలో ఫోరిక్ యాసిడ్, కాల్షియం ఉంటాయి. ఇవి ఎనిమియాను దూరం చేస్తాయి.
ఉపవాసాలతో రోగాలు దూరం: డాక్టర్ విష్ణు
ఉపవాసాలు ఉండటంవల్ల మనుషులు ఆరోగ్య వంతులుగా ఉంటారని డాక్టర్ విష్ణు(Dr. Vishnu) తెలిపారు. బ్లడ్ ప్రెషర్, షుగర్ సాధారణ స్థితికి వస్తుందన్నారు. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి కలుగుతుందని తెలిపారు. బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుందని, జీర్ణకోశ వ్యాధులు తగ్గుతాయని, శరీరంలో డి హైడ్రేషన్‌కు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. షుగర్, బ్లడ్ ప్రెషర్, దీర్ఘకాల వ్యాధులున్న వారు వైద్యుల సలహాలు తీసుకొని ఉపవాసాలు ఉండవచ్చని, కుల మతాలకు అతీతంగా నెలలో ఐదు ఉపవాలు ఉన్న రోగాలనుంచి విముక్తి లభిస్తుందని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News