Share News

శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులకు తొమ్మిది రంగులు

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:24 AM

నవరాత్రుల్లో ప్రతి రోజుకూ ఒక ప్రత్యేక రంగు ఉంటుంది. అమ్మవారి తొమ్మిది రూపాలకు తొమ్మిది రంగులను ప్రతీకగా భక్తులు భావిస్తారు.

శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులకు తొమ్మిది రంగులు

ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (ఆదివారం) శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెల 11 నుంచి 19 వరకూ కొనసాగనున్నాయి. ఈ నవరాత్రుల్లో ప్రతి రోజుకూ ఒక ప్రత్యేక రంగు ఉంటుంది. అమ్మవారి తొమ్మిది రూపాలకు తొమ్మిది రంగులను ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఈ రంగుల దుస్తులను ధరించటం శుభప్రదమని విశ్వసిస్తారు. ఏ రోజు ఏ రంగు వస్త్రాలు ధరించాలో తెలుసా..?


ఆదివారం - అక్టోబర్ 11: నారింజ

నవరాత్రుల్లో మొదటిరోజు నారింజ రంగు దుస్తులను ధరించడం శుభప్రదమని భక్తుల నమ్మకం. ఈ రంగు దుస్తులను ధరించి శైలపుత్రి దేవిని పూజిస్తారు. నారింజ రంగును ఉత్సాహం, శక్తి, ఆప్యాయత, సానుకూలతలకు చిహ్నంగా పరిగణిస్తారు.

సోమవారం - అక్టోబర్ 12: తెలుపు

రెండో రోజున తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు. ఈ రంగు స్వచ్ఛత, శాంతి, అమాయకత్వం, సాత్విక గుణాలకు ప్రతీక. తెలుపు రంగు దుస్తులు ధరించి బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తారు.

మంగళవారం - అక్టోబర్ 13: ఎరుపు

మూడో రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి చంద్రఘంట దేవిని పూజిస్తారు. ఎరుపు రంగును బలానికి, శౌర్యానికి, ఉత్సాహానికి ప్రతీకగా భావిస్తారు.


బుధవారం - అక్టోబర్ 14: ముదురు నీలం

నాలుగో రోజు కూష్మాండ దేవికి పూజ జరుగుతుంది. ఇందులో భక్తులు ముదురు నీలం రంగు దుస్తులను ధరిస్తారు. ఇది వైభవం, ప్రతిష్ఠలకు చిహ్నం.

గురువారం - అక్టోబర్ 15: పసుపు

పసుపు రంగు ఆనందం, జ్ఞానం, సంతోషాలకు ప్రతీక. ఈ రంగు వస్త్రాలను ధరించి స్కందమాతను ఆరాధిస్తారు.

శుక్రవారం - అక్టోబర్ 16: ఆకుపచ్చ

ఆకుపచ్చ రంగు ప్రకృతికి, అభివృద్ధికి చిహ్నం. నవరాత్రుల్లో ఆరో రోజున ఈ రంగు దుస్తులను ధరించి కాత్యాయనీ దేవిని పూజిస్తారు.


శనివారం - అక్టోబర్ 17: బూడిద రంగు

బూడిద రంగు వస్త్రాలను ధరించి కాళరాత్రి అమ్మవారిని కొలుస్తారు. ఈ రంగు సమతుల్యతకు, సహనానికి ప్రతీక.

ఆదివారం - అక్టోబర్ 18: ఊదా రంగు

ఊదా రంగు ఐశ్వర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. మహాగౌరీ దేవి పూజలో ఈ రంగు దుస్తులను ధరిస్తారు.

సోమవారం - అక్టోబర్ 19: నెమలి ఆకుపచ్చ రంగు

నెమలి ఆకుపచ్చ రంగును తాజాదనం, ప్రత్యేకతలకు ప్రతీకగా భావిస్తారు. నవరాత్రుల్లో చివరి రోజు ఈ రంగు వస్త్రాలను ధరించి సిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారు.


ఇవీ చదవండి

నవరాత్రుల సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు?

దేవీ శరన్నవరాత్రులు.. అమ్మవారి ఒక్కో రూపం వెనుక ఉన్న విశిష్టత ఇదే!

Updated Date - Oct 11 , 2026 | 11:24 AM