జయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే.. పాపాలన్నీ తొలగిపోతాయి.!
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:26 AM
హిందూ సంప్రదాయంలో 'జయ ఏకాదశి' కి గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని, మరణం అనంతరం మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఇంటర్నెట్ డెస్క్: ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి రోజున విష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉంటే ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతుంటారు. ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది వచ్చే ‘జయ ఏకాదశి’ చాలా విశేషమైనది. ఏకాదశి తిథి బుధవారం(జనవరి 28) సాయంత్రం గం.4:35కు ప్రారంభమై.. గురువారం మధ్యాహ్నం గం.1:55కు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ‘రవి వియోగం’ ఏర్పడటంతో ఉపవాసం, పూజా కార్యక్రమాలు చేయడం వల్ల పుణ్య ఫలం రెట్టింపు అవుతాయట. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తే ఏళ్లనాటి దైన్యస్థితి తొలగిపోయి, అష్టైశ్వార్యాలు సిద్దిస్తాయని పండితులు చెబుతున్నారు.
పాటించాల్సిన నియమాలు:
ఈ రోజు బియ్యంతో చేసిన పదార్థాలేవీ తినకూడదు.
శ్రీ మహావిష్ణువుకు పండ్లు, పూలు సమర్పించి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి.
సాయంత్రం వేళ తులసి కోట వద్ద నెయ్యితో దీపారాధన చేయాలి.
విష్ణుమూర్తికి పసుపు రంగు దుస్తులంటే ప్రీతి. కావున పసుపు పువ్వులు, దుస్తులు ధరిస్తే చాలా మంచిది.
పాయసం లేదా స్వీట్లు స్వామివారికి నివేదించాలి.
రోజంతా ఉపవాసం, రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
జయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే.. బ్రహ్మహత్యా పాతకం వంటి పాపాలు నశించిపోతాయి
ఈ రోజు పూజా కార్యక్రమాలు చేస్తే.. పితృదేవతలకు శాంతి లభిస్తుంది. వారి ఆశిస్సులు కుటుంబంపై ఉంటాయని భక్తుల విశ్వాసం.
గమనిక: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఇవి కూడా చదవండి:
అమరావతికి చట్టబద్ధత కల్పించాలి