Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 14 , 2026 | 07:41 AM

ఈ వారం రాశిఫలాలు..14 -20 జూన్‌ 2026 పి.ప్రసూనా రామన్‌

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgకొంతమేరకు అనుకూలదాయకం. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్‌ ఫైనాన్సుల్లో మదుపు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgలక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆత్మీయులు చేయూతనిస్తారు. చేస్తున్న పనుల పట్ల ఏకా గ్రత వహించండి. అనవసర విషయాలజోలికి పోవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేేస వ్యక్తులున్నారు జాగ్రత్త. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgసహనమే శ్రీరామరక్ష, ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. ప్రతికూలతలు నిదానంగా తొలగుతాయి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పిల్లలకు విదేశీ విద్యావకాశం లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయం వల్ల నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgసంప్రదింపులు నిరుత్సాహ పరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోవుతారు. ఒత్తిడికి గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆప్తులతో కాల క్షేపం చేస్తారు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలు వైన వస్తువులు జాగ్రత్త. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. నోటీసులు అందుకుంటారు.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgఅన్ని విధాలా కలిసివస్తుంది. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. వ్యవహా రాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయు లకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ఆచి తూచి అడుగు వేయాలి.ఆత్మీయులతోతరచూ సంభాషిస్తారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. వేడు కలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgమీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మొండిగా ముందుకు సాగుతారు. సంస్థల స్థాపనకు తరుణం కాదు. సన్నిహితుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgలక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు అడుగవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. వ్యవహారంలో ఆచితూచి అడుగేయాలి. మితంగా సంభాషించండి.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgఅనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు ప్రారంభం నాటికి ఆటంకాలు ఎదు రవుతాయి. సామరస్యంగా మెలగండి. ఖర్చులు తగ్గించుకుంటారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgపరిస్థితులు అనుకూలిస్తాయి. లౌక్యంగా మెలుగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రభుత్వ కార్యాల యాల్లో పనులు సానుకూలమవుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. పొదు పుధనం గ్రహిస్తారు. ఉత్సాహంగా గడుపు తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgఆశావహదృక్పథంతో మెల గండి. ఆదాయం నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. అందరితోనూ మితంగా సం భాషించండి. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఆంతరంగిక విష యాలు వెల్లడించవద్దు. నోటీసులు అందు కుంటారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgకార్యసిద్థి, వ్యవహారజయం ఉన్నాయి. మీ ఇష్టాయిష్టాలకు ఆమోదం లభి స్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. పొదుపు ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgఅనుకున్న లక్ష్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. మరో సారి యత్నించండి. నేడు అనుకూలించనిది రేపు సాధ్యమవుతుంది. సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం.


ఈ వార్తలు కూడా చదవండి:

త్వరలో ఆర్టీసీలో వెల్ఫేర్‌ కమిటీల రద్దు

స్వయంకృషితో ఎదిగిన మేధావి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 07:41 AM