Share News

నాడు తండ్రి.. నేడు తల్లి మృతి

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:30 PM

రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబం, కూలిపోయే దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు, 14సంవత్సరాల క్రితం ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం పాలై తండ్రి మృతి చెందాడు.

నాడు తండ్రి.. నేడు తల్లి మృతి

  • అనాథలైన ఇద్దరు కుమార్తెలు

  • చందాలు వేసుకొని దహన సంస్కారాలు నిర్వహించిన గ్రామస్థులు

అక్కన్నపేట(మెదక్): రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబం, కూలిపోయే దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు, 14సంవత్సరాల క్రితం ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం పాలై తండ్రి మృతి చెందాడు. తల్లి తలపాక కనకవ్వ(48)అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. దీంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. మండలంలోని కేశవాపూర్‌(Keshavapur) గ్రామానికి చెందిన తలపాక కనకవ్వ- లింగయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 2012లో కుటుంబ పెద్ద లింగయ్య ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు.


srd2.2.jpgఅప్పటి నుంచి తల్లి కనకవ్వ కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలను పోషించుకుంటుంది. కొన్ని నెలల నుంచి కనకవ్వ కూడా అనారోగ్యం బారిన పడడంతో సోమవారం మృతి చెందింది. తల్లిదండ్రుల మృతితో అక్కా, చెల్లెలు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. తల్లి దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం రూ. 5వేలు ఆర్థిక సాయం అందించగా, పలువురు గ్రామస్థులు చందాలు వేసుకొని దహన సంస్కారాలు నిర్వహించారు. తల్లి మృతదేహానికి పెద్ద కూతురు నిప్పు పెట్టి దహన సంస్కారాలు చేసింది. అనాధలైన శరణ్య, శ్వేతలన ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్‌ బోనగిరి మమత- తిరుపతి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హోలీ హంగామా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 12:30 PM