Share News

దుబాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. షాపింగ్ మాల్‌కు వెళ్లిన యూఏఈ ప్రెసిడెంట్

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:57 AM

ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ ఓ గొప్ప పని చేశారు. సోమవారం సాయంత్రం దుబాయ్‌లోని షాపింగ్ మాల్‌కు వెళ్లారు.

దుబాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. షాపింగ్ మాల్‌కు వెళ్లిన యూఏఈ ప్రెసిడెంట్
UAE President Dubai Mall visit

ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు 1,240పైగా స్థావరాలపై దాడులు చేశాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు యూఏఈలోని అమెరికా ఎయిర్ బేస్‌లపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అరబ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు పేలుళ్లతో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఫేక్ న్యూస్ కారణంగా జనం మరింత భయాందోళనకు గురవుతున్నారు. సైరన్ లేని సమయంలో కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.


ఇలాంటి సమయంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ ఓ గొప్ప పని చేశారు. సోమవారం సాయంత్రం దుబాయ్‌లోని షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ఆయనతో పాటు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా వెళ్లారు. షాపింగ్‌ మా‌ల్‌లోని ప్రజలను ఎంతో ప్రేమగా పలకరించారు. వారితో సెల్ఫీలు, ఫొటోలు సైతం దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను దుబాయ్ మీడియా ఆఫీస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.


తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాలు

ఇరాన్ దాడుల కారణంగా అరబ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్ దాడుల్లో అమెరికా మిలటరీ స్థావరాలతో పాటు.. ఎయిర్‌పోర్ట్‌లు, హోటల్స్‌ దెబ్బతింటున్నాయి. ఇరాన్‌ యుద్ధంతో ఖతార్‌లో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. గల్ఫ్‌లో చమురు నౌకలకు వార్ రిస్క్‌ కవరేజ్‌ ఇన్సూరెన్స్‌ సైతం రద్దయింది. ఇరాన్‌ దాడులతో ఇప్పటికే 4 ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం అయ్యాయి. హర్‌మూజ్‌ జలసంధిలో 150 నౌకలు నిలిచిపోయాయి. ఎల్ఎన్‌జీ గ్యాస్‌ ఉత్పత్తిని ఖతార్‌ ఆపేసింది.


ఇవి కూడా చదవండి

టమాట ధర ఢమాల్‌!

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Updated Date - Mar 03 , 2026 | 12:13 PM