ప్రాణం తీసిన బుల్లెట్ రైడ్
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:27 PM
రాత్రి వేళ సరదాగా ‘బుల్లెట్ రైడ్’కు వెళ్లిన ఇద్దరు యువతులు ప్రమాదబారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.
రాత్రి వేళ ఇద్దరు యువతుల ప్రయాణం
అదుపు తప్పి ప్రమాదం.. ఒకరి దుర్మరణం
మృతురాలికి నాలుగు నెలల కిందటే వివాహం
బెంగళూరు: రాత్రి వేళ సరదాగా ‘బుల్లెట్ రైడ్’కు వెళ్లిన ఇద్దరు యువతులు ప్రమాదబారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. హాసన్‌లో స్వాతి, తన స్నేహితురాలు ప్రియతో కలిసి బుల్లెట్ నడిపేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. పారిశ్రామికవాడ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ గమనించక ముందుకెళ్లి, అదుపు తప్పి కింద పడ్డారు. సత్యమంగల కాలనీకి చెందిన ప్రియా (23) అక్కడికక్కడే తీవ్ర గాయాలతో కన్నుమూసింది. బైక్ నడుపుతున్న స్వాతి తీవ్రంగా గాయపడింది.
గమనించిన స్థానికులు.. ఆమెను హాసన్(Hasan)లో ప్రథమ చికిత్సఅందించి, ఉన్నత చికిత్సకోసం బెంగళూరు(Bengaluru)కు తరలించారు. కాగా మృతి చెందిన ప్రియా ఎంసీఏ ఫైనల్ చదువుతున్నారు. నాలుగు నెలలక్రిందటే ఆమెకు వివాహం జరిగింది. స్వాతి, ప్రియా ఇద్దరు స్నేహితులు. బుల్లెట్ నడిపేవేళ ఇద్దరూ హెల్మెట్‌లు ధరించలేదు. హాసన్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేరళ రాష్ట్రం పేరు మార్పునకు రంగం సిద్ధం?
బ్రహ్మోస్ కంటే వేగవంతమైన మిసైల్! భారత్‌కు ఇజ్రాయెల్ ఆఫర్
Read Latest Telangana News and National News