Share News

గుబులు రేపుతున్న బర్డ్‌ ఫ్లూ

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:52 PM

ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ ప్రబలుతోందని వస్తున్న వార్తలతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు చెక్‌పో‌స్ట్‏ల వద్ద పర్యవేక్షణ తీవ్రతరం చేశారు.

గుబులు రేపుతున్న బర్డ్‌ ఫ్లూ

  • సరిహద్దు చెక్‌పోస్ట్‏లో ప్రత్యేక పర్యవేక్షణ

చెన్నై: ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ ప్రబలుతోందని వస్తున్న వార్తలతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు చెక్‌పో‌స్ట్‏ల వద్ద పర్యవేక్షణ తీవ్రతరం చేశారు. చిత్తూరు, తిరుపతి(Chittoor, Tirupati) తదితర జిల్లాల్లోని 50కి పైగా గ్రామాల్లో బర్డ్‌ఫ్లూతో వందలాది కోళ్లు మృతిచెందుతున్నట్లు అందిన వార్తలతో.. రాష్ట్ర పశుసంవర్థక శాఖ అధికారులు, ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని చెక్‌పో‌స్ట్‏ల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.


nani1.2.jpgతిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి- పొన్‌పాడి, ఊత్తుకోట- పెరియపాళయం, గుమ్మిడిపూండి- పొత్తికుళం తదితర మూడు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద వారం రోజులుగా పశుసంవర్థక శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర(Andhta) రాష్ట్రం నుంచి వచ్చే సరుకు ఆటోలు, వ్యాన్‌, లారీ తదితర వాహనాల్లో గుడ్లు, కోళ్లు, కోళ్ల దాణా తదితరాలు తీసుకొచ్చే వాహనాల టైర్లకు క్రిమినాశిని మందులు పిచికారీ చేసిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ బాధిత ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను వెనక్కి తిప్పి పంపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కేరళ రాష్ట్రం పేరు మార్పునకు రంగం సిద్ధం?

బ్రహ్మోస్ కంటే వేగవంతమైన మిసైల్! భారత్‌కు ఇజ్రాయెల్ ఆఫర్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 24 , 2026 | 12:52 PM