పెళ్లి పేరుతో వంచన.. యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 31 , 2026 | 10:35 AM
పెళ్లి పేరిట వంచనకు గురైన ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్: పెళ్లి పేరిట వంచనకు గురైన ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... రౌషణదౌల్లా బస్తీకి చెందిన సువర్ణ (28) తన అన్నావదినతో కలిసి ఉంటోంది. వారి సొంతూరు నల్గొండ జిల్లా దేవరకొండ. వనస్థలిపురం డిమార్ట్‌లో నాలుగు సంవత్సరాలుగా ఆమె ఉద్యోగం చేస్తున్నది. షాపింగ్‌కు వచ్చిన క్రమంలో రాకేష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇది కాస్త ప్రేమగా మారింది. ఈనెల 17న యువతిని పెళ్లి చేసుకుంటానంటే ఇంట్లో నుంచి నగదు, బంగారం తీసుకొని వెళ్లింది. తన కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదని రాకేష్ చెప్పాడు.
ఆమె తెచ్చిన డబ్బు, బంగారం తీసుకున్నాడు. అప్పటికే ఊరికెళ్లిన అన్నావదిన ఆదివారం ఇంటికి వచ్చారు. ఎంత కొట్టిన తలుపులు తీయక పోవడంతో స్థానికుల సహాయంతో వాటిని పగలగొట్టి చూస్తే సువర్ణ ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. బాలాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సోదరుడు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వారు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎన్‌జీ గ్యాస్ కోసం 2 కి.మీ క్యూ
డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీపై నేడు తీర్పు
Read Latest Telangana News and National News