Share News

డ్రగ్స్‌ కేసు నిందితుల కస్టడీపై నేడు తీర్పు

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:01 AM

మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సలో కాల్పులు, డ్రగ్స్‌ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులుదాఖలు చేసిన పిటిషన్‌పై రాజేంద్రనగర్‌ కోర్టు సోమవారం మరో సారి విచారణ చేపట్టింది.

డ్రగ్స్‌ కేసు నిందితుల కస్టడీపై నేడు తీర్పు

మొయినాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సలో కాల్పులు, డ్రగ్స్‌ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులుదాఖలు చేసిన పిటిషన్‌పై రాజేంద్రనగర్‌ కోర్టు సోమవారం మరో సారి విచారణ చేపట్టింది. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నందున ప్రధాన నిందితులను అయిదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. కాగా, డ్రగ్స్‌ కేసు విచారణలో మరిన్ని గోవా లింకులు బయటపడుతున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం ఇటీవల జూబ్లీహిల్స్‌కు చెందిన వైద్యుడు కోలా బాలాజీ పటేల్‌ను అదుపులో తీసుకుని ప్రశ్నించినప్పుడు మరికొన్ని విషయాలు వెల్లడయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రోహిత్‌రెడ్డితో సంబంధాలు ఉన్న బాలాజీ గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకువస్తున్నట్లు తేలింది. రోహిత్‌రెడ్డి మరికొందరు స్నేహితులతో వీకెండ్‌ పార్టీల్లో డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు విచారణలో బయటపడింది. గోవాకు చెందిన డీజే క్లింటన్‌ ద్వారా తరచూ ఈ డ్రగ్స్‌ అందుతున్నట్టు తేలింది.

Updated Date - Mar 31 , 2026 | 06:01 AM