Share News

అమ్మో.. బంగారం!

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:05 AM

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల మోత నేరగాళ్లకు కలిసి వస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో దుండగులు చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలకు తెగబడుతున్నారు.

అమ్మో.. బంగారం!

  • దోచుకుంటున్న దొంగలు..

  • జిల్లాలో పెరిగిన చైన్‌ స్నాచింగ్‌లు

  • ధరల మోతతో పెరుగుతున్న నేరాలు..

  • అప్రమత్తత ఒక్కటే మార్గం!

సిద్దిపేట: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల మోత నేరగాళ్లకు కలిసి వస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో దుండగులు చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలకు తెగబడుతున్నారు. ఫలితంగా మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

గతంలో జరిగిన పలు ఘటనలు జిల్లాను కలవరపెడుతున్నాయి. చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లిలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మహిళను కేవలం బంగారు ఆభరణాల కోసం దారుణంగా హత్య చేశారు.


భూంపల్లిలో ఒంటరిగా వెళ్తున్న మహిళపై దాడి చేసి నగలు ఎత్తుకెళ్లారు. సిద్దిపేట(Siddipet) పట్టణంలోని భారత్‌నగర్‌లో కోమటిచెరువు వద్ద వాకింగ్‌కు వెళ్లిన మహిళ మెడలో నుంచి మూడు తులాల చైన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. ఆ ఘటనలో వన్‌టౌన్‌ పోలీసులు సీసీ కెమెరాల సాయంతో 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్నప్పటికీ, చోరీల పరంపర మాత్రం ఆగడం లేదు.


టార్గెట్‌.. మహిళలే!

దుండగులు రెక్కీ నిర్వహించి మరీ దాడులకు పాల్పడుతున్నారు. పగటిపూట కాలనీల్లో తిరుగుతూ, తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వరుస సెలవు దినాల్లో దొంగతనాలు అధికమవుతున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లే మహిళలను, కాలేజీ విద్యార్థినులను టార్గెట్‌ చేస్తూ ఈ చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.


city6.2.jpgఅప్రమత్తత అవసరం..

బంగారం ధరలు పెరుగుతున్న దృష్ట్యా, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వెనుక ఎవరైనా అనుమానాస్పదంగా వస్తుంటే గమనిస్తూ, వెంటనే పోలీసులకు లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలి. బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు కనిపించకుండా చున్నీతో కప్పుకోవాలి.ఫోన్‌ మాట్లాడుకుంటూ లేదా మెసేజ్‌లు చూసుకుంటూ నడవడం ప్రమాదకరం. అపరిచిత వాహనాలు వెంట వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే రోడ్డు పక్కకు తప్పుకోవాలి. కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి.


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

డ్రగ్స్‌ కేసు నిందితుల కస్టడీపై నేడు తీర్పు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 31 , 2026 | 11:06 AM