Share News

కొనుగోలు చేస్తామని.. కొట్టేశారు

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:50 AM

ఓ ట్రేడింగ్‌ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్‌ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.

కొనుగోలు చేస్తామని.. కొట్టేశారు

  • రూ. 21.80 కోట్ల క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఓ ట్రేడింగ్‌ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్‌ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. సంస్థ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్‌క్రైం పోలీసులు.. ముగ్గురు అంతర్రాష్ట్ర నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌(Hyderabad)లోని కల్యాణ్‌నగర్‌కు చెందిన బాధితుడు ఆన్‌లైన్‌లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ చేసే సంస్థలో పనిచేస్తున్నాడు.


కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిని సంప్రదించి తమ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించారు. తాము పంపే లింకులో సంస్థ కేవైసీ సంబంధిత వివరాలు నమోదు చేస్తేనే అది సాధ్యమని మెలిక పెట్టారు. అందుకు అంగీకరించిన బాధితుడు.. నేరగాళ్లు పంపిన నకిలీ లింకులో సంస్థ వివరాలు నమోదు చేశాడు. వాటితో సంస్థ వెబ్‌సైట్‌(Website)ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు..


city3.2.jpgబాధితునికి తెలియకుండానే సంస్థ ఖాతాల్లోంచి 24.04 లక్షల యూఎస్‏డీటీ క్రిప్టో కరెన్సీని (సుమారు రూ. 21.80 కోట్లు) వారి ఖాతాల్లోకి మళ్లించారు. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన సంస్థ నిర్వాహకులు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుషీమ్‌ శ్రీపతి, శ్రీకాంత్‌, లక్కీ చౌదరిని అరెస్ట్‌ చేసినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అరవిందబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 17 , 2026 | 07:50 AM