ముగ్గు వేస్తుండగా చైన్ స్నాచింగ్
ABN , Publish Date - Mar 07 , 2026 | 10:19 AM
సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తు తెలియని దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.
హనుమకొండ: సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తు తెలియని దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సీఐ ఎం.రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్ కాలనీ(Hanumakonda Excise Colony)కి చెందిన మామిండ్ల నవ్య ఉదయం 7 గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత సందర్శించి వివరాలు తెలసుకున్నారు. దుండగులు ఎత్తుకెళ్లిన ఆభరణం విలువ రూ.80వేల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు
బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!
Read Latest Telangana News and National News