Share News

అద్దె ఆదాయంపై బతుకుతున్నా..

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:02 AM

జీ మీడియా, వినోద చానెళ్ల వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులన్నీ కరిగిపోయి ప్రస్తుతానికి మిగిలింది రూ.6.5 కోట్లేనని.. తన నివాసంలో కొంత భాగాన్ని అద్దెకివ్వడం ద్వారా లభించే ఆదాయంపైనే బతుకుతున్నానని ఆయన తెలిపారు.

అద్దె ఆదాయంపై బతుకుతున్నా..
subhash

  • ఇక స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయి స్నేహితులతో కలిసి పనిచేసుకుంటా..

న్యూఢిల్లీ: జీ మీడియా, వినోద చానెళ్ల వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులన్నీ కరిగిపోయి ప్రస్తుతానికి మిగిలింది రూ.6.5 కోట్లేనని.. తన నివాసంలో కొంత భాగాన్ని అద్దెకివ్వడం ద్వారా లభించే ఆదాయంపైనే బతుకుతున్నానని ఆయన తెలిపారు. ‘‘అన్నీ కోల్పోయిన వాడిలా కాకుండా ఈ రోజు మీతో చాలా సాధారణంగా మాట్లాడుతున్నా, నవ్వుతున్నా కూడా. ఇప్పుడు నా దగ్గరున్నది రూ.6.5 కోట్లే. వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రణాళికలో భాగంగా రుణదాతలకు ఆఫర్‌ చేసిన మేరకు ఆ మొత్తాన్నీ వదులుకోబోతున్నా. నాకో చిన్న ఇళ్లుంది. అందులో కొంత భాగాన్ని అద్దెకిచ్చా. ఆ అద్దె ఆదాయంతోనే ఖర్చులను నెట్టుకొస్తున్నా. ఇందుకు పశ్చాత్తాపం చెందట్లేదు. మళ్లీ సంపాదిస్తా. నేను మార్గదర్శకుడిని. మంచి, కొత్త పనులు ఎలా చేయాలో నాకు తెలుసు. మున్ముందూ అదే కొనసాగిస్తా’ అని తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకటనలో 75 ఏళ్ల సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు. సుభాష్‌ చంద్రపై వ్యక్తిగత దివా లా పరిష్కార కేసులో జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఢిల్లీ బెంచ్‌ తాజా తీర్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


‘స్విస్‌’కు మకాం మార్పు: ఇక తను స్విట్జర్లాండ్‌కు మకాం మార్చనున్నట్లు సుభాష్‌ చంద్ర తెలిపారు. ‘‘స్విట్జర్లాండ్‌లోని నా మిత్రులైన ఇన్వె్‌స్ట్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నా. వచ్చే 1-2 వారాల్లో ఈ విషయంపై పూర్తి వివరాలు వెల్లడిస్తా. కొత్త వ్యాపార ప్రస్థానం ప్రారంభించేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ.2-4 కోట్ల మేర రుణం తీసుకోవాలనుకుంటున్నా. ఆ సొమ్మును కొన్ని స్టార్ట్‌ప్‌ల్లో పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నా’’ అని ఆయన చెప్పారు.


ఇవీ చదవండి:

విదేశీ బీఎఫ్‌ఎస్ఐ కంపెనీల ‘జీసీసీ’ హవా

నేపాల్ వరదలు.. నలుగురు భారతీయులను రక్షించిన నేపాల్ ఆర్మీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 04:02 AM