విదేశీ బీఎఫ్‌ఎస్ఐ కంపెనీల ‘జీసీసీ’ హవా
ABN , Publish Date - Aug 30 , 2026 | 03:45 AM
విదేశీ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్ఐ) సంస్థలు భారత్ బాట పడుతున్నాయి. తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు మన దేశానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఆయా సంస్థలు అద్దెకు తీసుకుంటున్న కార్యాలయ స్థలం పెరుగుతోంది.
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్ఐ) సంస్థలు భారత్ బాట పడుతున్నాయి. తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు మన దేశానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఆయా సంస్థలు అద్దెకు తీసుకుంటున్న కార్యాలయ స్థలం పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ ఇండియా ప్రకారం.. జనవరి-జూన్ (ఈ ఏడాది ప్రథమార్ధం) కాలంలో ఈ సంస్థలు అద్దెకు తీసుకున్న కార్యాలయ స్థలం రికార్డు స్థాయిలో 73.2 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. అయితే ఇదే కాలంలో మరో పరిణామం చోటు చేసుకుంది. జీసీసీల ఏర్పాటుకు సంబంధించి విదేశీ ఐటీ-ఐటీఈఎస్ కంపెనీలు అద్దెకు తీసుకున్న స్థలం 41.3 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. ఏడాది క్రితం ఇది 57.1 లక్షల చదరపు అడుగులుగా ఉంది.
ఈ ఏడాది ప్రథమార్ధంలో విదేశీ బీఎఫ్‌ఎస్ఐ సంస్థలు దేశంలోని 8 ప్రధాన నగరాల్లో (ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా) జీసీసీల ఏర్పాటు కోసం 73.2 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయని, గత ఏడాది ఇదే కాలం (43.1 లక్షల చదరపు అడుగులు)తో పోల్చితే ఇది 70 శాతం పెరిగిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జీసీసీలు అద్దెకు తీసుకున్న 2.06 కోట్ల చదరపు అడుగుల స్థలంలో బీఎఫ్‌ఎస్ఐ రంగం వాటా 36 శాతంగా ఉంది.
ఇవీ చదవండి:
ఫిన్లాండ్‌లో ఒత్తిడి లేని విద్య
Read Latest Telangana News And AP News And National News
And Telugu News