Share News

మండుతున్న కూరగాయలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:58 AM

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లిపాయలు (పెద్దవి) రెండు వారాల వ్యవధిలో కిలోకి రూ.30లు పెరిగింది. రెండు వారాల క్రితం వరకు ఉల్లి ధర రూ.25 నుంచి రూ.30లు ఉండేది. గత వారం ఒకేసారి రూ.20లు పెరిగి కిలో రూ.50లు ఽఅయింది, శనివారం మరో రూ.10లు పెరిగి రూ.60లకు చేరింది.

మండుతున్న కూరగాయలు
దుకాణంలో కూరగాయలు

- రెండు వారాల వ్యవధిలో రూ.30లు పెరిగిన ఉల్లి

- మిగతా వాటిపై కిలోకి రూ.20లు పెరుగుదల

నర్సీపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లిపాయలు (పెద్దవి) రెండు వారాల వ్యవధిలో కిలోకి రూ.30లు పెరిగింది. రెండు వారాల క్రితం వరకు ఉల్లి ధర రూ.25 నుంచి రూ.30లు ఉండేది. గత వారం ఒకేసారి రూ.20లు పెరిగి కిలో రూ.50లు ఽఅయింది, శనివారం మరో రూ.10లు పెరిగి రూ.60లకు చేరింది. గత వారం కిలో టమాటా రూ.25 ఉంటే, ఈ వారం రూ.30లకు పెరిగింది. కాలీఫ్లవర్‌ ఒక్కొక్కటి రూ.30లు చొప్పున విక్రయిస్తే, ఈ వారం కిలోల లెక్కన విక్రయించారు.ఽ ఆగాకర కిలో రూ.120, బీన్స్‌ రూ.120, అల్లం కిలో రూ.160, చిక్కుడు కాయలు కిలో రూ.80లు, క్యారెట్‌, బీట్‌రూట్‌ కిలో రూ.50 చొప్పున విక్రయించారు. నల్ల వంకాయలు రూ.60లు, తెల్లవంకాయలు రూ.40లకు అమ్మారు. అలాగే బీరకాయలు కిలో రూ.50లు, పచ్చిమిర్చి రూ.60 విక్రయించారు. కూరగాయల ధరలు పెరగడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:58 AM