Share News

చిన్నారిపై హత్యాచారం.. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం..

ABN , Publish Date - Aug 29 , 2026 | 08:27 PM

చిన్నారిపై హత్యాచారం చేసిన వ్యక్తి పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది.

చిన్నారిపై హత్యాచారం.. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం..
Uttar Pradesh Police

ఇంటర్‌నెట్ డెస్క్: చిన్నారిపై హత్యాచారం చేసిన వ్యక్తి పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రేటర్ నోయిడాకు చెందిన బాలరాజ్ అనే వ్యక్తి శుక్రవారం ఆరేళ్ల ఓ బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు. తర్వాత బాలిక మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి, ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని పొలంలో పడేశాడు. బాలిక కనిపించకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ఉండే ఏరియాలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు బాలరాజు మీద అనుమానం వచ్చింది. శనివారం మధ్యాహ్నం అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాలరాజును విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. బాలికను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని ఈకోటెక్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని 'డి పార్క్' సమీపంలో ఉన్న గ్రీన్ బెల్ట్ పొదల్లో దాచినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని కత్తి దాచిన ప్రదేశానికి తీసుకెళ్లారు.


పొదల్లో కత్తిని వెతికే నెపంతో వెళ్లిన నిందితుడు.. అక్కడ దాచి ఉంచిన పిస్టల్‌తో పోలీసులపై కాల్పులు జరిపాడు. నిందితుడి కాల్పుల్లో రవి కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు కాల్పులు జరుపుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో బాలరాజు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలరాజు, హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలరాజును పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.


ఇవి కూడా చదవండి

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు అధిష్టానం బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ

Updated Date - Aug 29 , 2026 | 08:36 PM