Share News

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు అధిష్టానం బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ

ABN , Publish Date - Aug 29 , 2026 | 06:15 PM

హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న ఎంఐఎం.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు అధిష్టానం బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ
Mirza Rahmath Baig

హైదరాబాద్‌, ఆగస్టు 29: నగరంలోని ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎంఐఎం కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే పార్టీని వీడాలని ఆదేశించిన అధిష్టానం.. ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని సూచించింది. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్‌కు పంపాలని స్పష్టం చేసింది. ఓ మహిళ ఇంట్లోకి మారువేషంలో వెళ్లిన వ్యవహారానికి సంబంధించి రహ్మత్ బేగ్‌పై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరణలు, పరిణామాలను పరిశీలించిన అనంతరం పార్టీ క్రమశిక్షణ చర్యలకు దిగినట్లు సమాచారం.


ఇక పార్టీ ఆదేశాలపై మిర్జా రహ్మత్ బేగ్ స్పందించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు పార్టీ అధిష్టానం మాత్రం పదవికి రాజీనామా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రహ్మత్ బేగ్ వ్యవహారం ఎంఐఎంలో మరింత చర్చనీయాంశంగా మారింది. పార్టీ నిర్ణయం, ఎమ్మెల్సీగా రహ్మత్ బేగ్ తీసుకోబోయే తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి...

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యపై అధికారుల వివరణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 06:23 PM