Share News

5 ఐపీఓలు.. రూ.2,600 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:03 AM

ఈ వారంలో మరో ఐదు కంపెనీలు తమ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లతో ఇన్వెస్టర్ల ముందుకు రాబోతున్నాయి. ఈ కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌ నుంచి...

5 ఐపీఓలు.. రూ.2,600 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ఈ వారంలో మరో ఐదు కంపెనీలు తమ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లతో ఇన్వెస్టర్ల ముందుకు రాబోతున్నాయి. ఈ కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌ నుంచి రూ.2,600 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తు న్నాయి. వీటిలో ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్‌, ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీస్‌, ఎంకే సన్స్‌ ఫైన్‌ జువెల్స్‌, బీఎల్‌ఎస్‌ పాలీమర్స్‌, బాంబే కోటెడ్‌ అండ్‌ స్పెషల్‌ స్టీల్స్‌ ఉన్నాయి. ఈ ఐపీఓల సబ్‌స్ర్కిప్షన్‌ అక్టోబరు 26-29 తేదీల మధ్య ప్రారంభం కానుంది.

  • ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్‌ రూ.1,200 కోట్ల ఐపీఓ అక్టోబరు 26న ప్రారంభమై 28న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరను రూ.1,585-1,665గా నిర్ణయించింది.

  • ఎస్‌ఎ్‌ఫసీ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీస్‌ రూ.668 కోట్ల ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్‌ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఒక్కో షేరు ప్రైస్‌బ్యాండ్‌ రూ.313 -330గా ఉంది. ఇష్యూలో భాగంగా రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు. 1.57 కోట్ల వరకు షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు.

  • ఎంకే సన్స్‌ ఫైన్‌ జువెల్స్‌ రూ.275.4 కోట్ల ఐపీఓ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.153-162గా ఉంది. 1.36 కోట్ల తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో 34 లక్షల షేర్లను విక్రయించనున్నారు.

  • బీఎల్‌ఎస్‌ పాలీమర్స్‌ రూ.255 కోట్ల ఐపీఓతో రానుంది. ఇది అక్టోబరు 27న ప్రారంభమై 29న క్లోజవుతుంది. ప్రైస్‌బ్యాండ్‌ రూ.142-150గా ఖరారు చేసింది. ఐపీలో భాగంగా 1.7 కోట్ల తాజా షేర్లను విక్రయించనున్నారు.

  • బాంబే కోటెడ్‌ అండ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ రూ.183.1 కోట్ల ఐపీఓను ఈ నెల 29న ప్రారంభించనుంది. నవంబరు 2న ఇష్యూ ముగుస్తుంది. ప్రైస్‌బ్యాండ్‌ రూ.78-82గా ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 04:04 AM