హైదరాబాద్‌లో ఏఎస్‌బీఎల్ లెగసీ
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:07 AM
హైదరాబాద్‌కు చెందిన రియల్టీ సంస్థ ఏఎస్‌బీఎల్.. ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్ లెగసీ పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో జీ+50 ఫోర్లతో మొత్తం మూడు టవర్లను నిర్మించనుంది.
ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒక్కోటి 50 ఫోర్లతో మూడు టవర్ల అభివృద్ధి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన రియల్టీ సంస్థ ఏఎస్‌బీఎల్.. ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్ లెగసీ పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో జీ+50 ఫోర్లతో మొత్తం మూడు టవర్లను నిర్మించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అజితేష్ కొరుపోలు వెల్లడించారు. 2,000-3,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో మొత్తం 1,500 యూనిట్ల 3,4 బీహెచ్‌కే ఫ్లాట్లను నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. 2031 జూన్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన తెలిపారు. సెప్టెంబరు నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు అజితేష్ పేర్కొన్నారు. లెగసీ ప్రాజెక్టు భూమి కోసం రూ.400 కోట్లు వెచ్చించగా నిర్మాణం కోసం మరో రూ.1,800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,850 కోట్లుగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.2,500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కాగా 2030-31 తర్వాత పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అజితేష్ తెలిపారు.
‘క్యూఆర్ కోడ్’ ఉన్న బియ్యం బస్తాలనే దించుకోండి
ఆలస్యమే.. ప్రాణాలు కాపాడింది..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News