Share News

‘క్యూఆర్‌ కోడ్‌’ ఉన్న బియ్యం బస్తాలనే దించుకోండి

ABN , Publish Date - Aug 28 , 2026 | 01:52 AM

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం సెప్టెంబరు నుంచి క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ కోడ్‌ ఉన్న బియ్యం బస్తాలనే రేషన్‌ డీలర్లు దించుకోవాలి’ అని డీఎస్వో వెంకట్రాముడు సూచించారు.

‘క్యూఆర్‌ కోడ్‌’ ఉన్న బియ్యం బస్తాలనే దించుకోండి
చిత్తూరులో ఎం.ఎల్‌.స్టాక్‌ లెవెల్‌ పాయింట్‌ను తనిఖీ చేస్తున్న డీఎస్వో

డీలర్లకు డీఎస్వో సూచన

అక్రమ రవాణాలో పట్టుబడితే డీలర్‌షిప్‌ రద్దుచేస్తామని హెచ్చరిక

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ‘రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం సెప్టెంబరు నుంచి క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ కోడ్‌ ఉన్న బియ్యం బస్తాలనే రేషన్‌ డీలర్లు దించుకోవాలి’ అని డీఎస్వో వెంకట్రాముడు సూచించారు. గురువారం ఆయన చిత్తూరులోని మండల స్థాయి స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. క్యూఆర్‌ కోడ్‌ లేని బస్తాలను డీలర్లకు సరఫరా చేయొద్దన్నారు. సెప్టెంబరు నెల కోటాగా తొమ్మిది వేల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందని వివరించారు. అన్ని బస్తాలకు క్యూఆర్‌ కోడ్‌ డిజిటల్‌ స్కానింగ్‌ పూర్తి చేశాక డీలర్లకు పంపిణీ చేయాలన్నారు. స్కానింగ్‌ చేయకుంటే ఎంఎల్‌ పాయింట్‌ అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం కయనికట్టు వీధిలోని రేషన్‌ షాపును తనిఖీ చేశారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడితే.. ఆ బస్తా మీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ పరిశీలించి సంబంధిత డీలర్‌ను గుర్తించి డీలర్‌షి్‌పను రద్దుచేస్తామని హెచ్చరించారు. ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిర్దేశిత సమయాల్లో చౌక దుకాణాలను తెరవాలని స్పష్టంచేశారు.

Updated Date - Aug 28 , 2026 | 01:52 AM