రూ.600 కోట్లతో అమయా సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:57 AM
హైదరాబాద్‌లో సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు వెరా విటా లివింగ్ ప్రకటించింది. అమయా పేరుతో హైదరాబాద్ సమీపంలోని కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద 13 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు వెరా విటా లివింగ్ ప్రకటించింది. అమయా పేరుతో హైదరాబాద్ సమీపంలోని కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద 13 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ కో ఫౌండర్స్ అరుద్రదేవ్ రావు, ధ్రువ్ బద్రుకా, తనయ్ సాబు వెల్లడించారు. తొలి దశలో సుమారు మూడెకరాల విస్తీర్ణంలో 256 ఫ్లాట్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ల కోసం ప్రత్యేకంగా క్లబ్ హౌస్, వెల్‌నెస్, ఫిట్‌నెస్ సదుపాయాలతో పాటు హాస్పిటాలిటీ సేవలను కూడా అందించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కూనురు, పుణె నగరాలకు కార్యకలాపాలు విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌లో కుదేలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News