అన్నా.. నీ అనురాగం
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:25 AM
అన్నాచెల్లెళ్ల ఆత్మీయనురాగాలకు వేదికగా రక్షాబంధన్ నిలుస్తుంది. పురాణాల్లో కూడా రక్షాబంధన్ ప్రస్తావన ఉంది. కుటుంబ బంధాలను పెంచేందుకు, మానవ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు ఎంతో ఉపయోగపడే పండుగ రాఖీ. మనుషుల్లో ప్రేమ, ఆప్యాయత, మమతలను పరిమళింపజేయడానికి వచ్చిన పండుగ రక్షాబంధన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అతివలు తమ సోదరులకు రాఖీ కట్టే రక్షాబంధన్ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు.
- నేడు రాఖీ పండుగ.. నూలు పౌర్ణమి
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అన్నాచెల్లెళ్ల ఆత్మీయనురాగాలకు వేదికగా రక్షాబంధన్ నిలుస్తుంది. పురాణాల్లో కూడా రక్షాబంధన్ ప్రస్తావన ఉంది. కుటుంబ బంధాలను పెంచేందుకు, మానవ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు ఎంతో ఉపయోగపడే పండుగ రాఖీ. మనుషుల్లో ప్రేమ, ఆప్యాయత, మమతలను పరిమళింపజేయడానికి వచ్చిన పండుగ రక్షాబంధన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అతివలు తమ సోదరులకు రాఖీ కట్టే రక్షాబంధన్ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఒకప్పుడు రాఖీ పండుగ ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే వారు. క్రమేణా రాఖీ పండుగ అన్నా చెళ్లెల్ల అనురాగానికి ప్రతీకగా మారి జాతీయ పండుగలాగా దేశంలోని అన్ని మారుమూల గ్రామా ల్లో సైతం జరుపుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రాలో రాఖీగా పిలిస్తే.... మహారాష్ట్ర, గోవా, గుజారాత్‌లో నార్యల్ పూర్ణిమ, ఒరిస్సాలో బ్రహ్మ పూర్ణిమ, ఉత్తరా ఖండ్‌లో జనోపున్య, మధ్యద్రేశ్, ఛత్తీస్‌ఘడ్, బీహార్‌లలో ఖజరీ పూర్ణిమగా పిలుస్తుంటారు.
ఫ రాఖీ కొనుగోళ్ల సందడి
రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఏటా వందలాది కొత్త మోడల్స్ రాఖీలు మార్కెట్‌లో కనిపిస్తాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా రాఖీ అమ్మకాల దుకాణాలు ఏర్పడ్డాయి. ఒక్కో రాఖీ ఒక్కో ప్రత్యేకతతో ఆకర్షిస్తు న్నాయి. రాఖీలు రూ 20 నుంచి రూ 1500 వరకు ఉన్నాయి. వెండి, బంగారం ఉపయోగించి చేసిన రాఖీలు ఉన్నాయి. పాత కాలంలో అతిపెద్దగా ఉండే రాఖీలు కట్టుకునే వారు. మళ్లీ ఆ ట్రెండ్ వచ్చింది. మార్కెట్లో రూ 50ల నుంచి రూ 100 విలువ చేసే పెద్ద రాఖీలు అమ్మకాలు జరుగుతున్నాయి. చిన్నపి ల్లలను ఆకర్షించే విధంగా 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు క్రికెట్, మిక్కిమౌస్, స్పైడర్ మ్యాన్, డిజైన్లలో కూడా రాఖీలు వచ్చాయి. స్టోన్ రాఖీలు రూ. 25నుంచి రూ.300ల వరకు లభిస్తు న్నాయి. 1 గ్రాముతో తయారు చేసిన రాఖీలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.
ఫ జంధ్యాల పూర్ణిమ
శ్రావణ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమ (నూలు పౌర్ణమి)గా జరుపుకుంటారు. యజ్ఞోపవీతాన్ని శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకుంటారు. సంవత్సరం మధ్యలో మార్చుకోవల్సిన అవసరం ఉన్నా శ్రావణ పూర్ణిమ నాడు విధిగా నూతన ధారణ చేస్తారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోమవారం అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములకు వారి క్షేమాన్ని కోరుతూ రక్షగా రాఖీ కట్టే పండుగను జరుపుకోవడానికి సిద్దమవుతున్నారు. శ్రావణ పూర్ణిమ రోజు రక్ష కట్టి వారు కోరిన వరాలను పొందే పవిత్ర దినంగా కూడా జరుపుకుంటారు. నూ లు పౌర్ణమి సందర్భంగా పద్మశాలీలు మార్కండేయ స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఆప్యాయతను పెంచుతుంది
- డాక్టర్ రాణీప్రసాద్, బాలసాహితీ వేత్త
రాఖీ పండుగ మనుషుల్లో ప్రేమను పెంచుతుంది. ఆప్యాయత మమతను పరమళింప చేయడం కోసం ఈ రక్షా బంధనం రక్త సంబంధీకుల మధ్య ఆనం దాన్ని నింపుతుంది.
చూడముచ్చటగా కొత్త కొత్త మోడల్స్
- కోల రుచిత, వేములవాడ
మార్కెట్లో రాఖీలు చూడముచ్చటగా కొత్త కొత్త మోడల్స్‌లో ఉన్నాయి. ఏది తీసుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. హైదరాబాదులో చదువుకుంటున్నా ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వచ్చి సోదరులకు రాఖీ కడతాను.
సోదరులకు శుభం కలుగాలని
- బుర్రవేణి భవాణి, ఎల్లారెడ్డిపేట
సోదర భావాన్ని పెంచడమే కాకుండా ఆత్మీయత, అనురాగాలకు దర్పణం పడుతుంది. రాఖీ పండుగ తమ సోదరులకు శుభం కలుగాలని కోరుకుంటాం. రక్త బంధానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. ఆయురా రోగ్యాలను, పెంచడమే కాకుండా కుటుంబ సభ్యులం దరు ఒకచోట చేరుకోవడానికి దోహదపడుతుంది.
రక్షాబంధన్ ధైర్యాన్నిస్తుంది
- మాణిక్యరావు సంగీత
శ్రావణమాసమంతా పండుగలతో సందడిగా ఉన్నా రక్షాబంధన్ అంటేనే ఇష్టం. మహిళలకు ఆధ్యాత్మికంగా నోములు, వ్రతాలకు శ్రావణమాసం ముఖ్యమైంది రక్షాబంధన్ తోబుట్టువులు అండగా ఉన్నారనే ధైర్యాన్నిస్తుంది. సోదరులకు రక్ష కట్టి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని సోదరి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.
ఫ అన్నకు రాఖీ.. చెల్లికి భరోసా
వేములవాడ : శ్రావణ పూర్ణిమ నాడు చెల్లెలు తన అన్నయ్య చేతికి ప్రేమతో రాఖీ కడితే, అన్న తన చెల్లిలిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడు కుంటానని మాట ఇచ్చే గొప్ప సంప్రదాయం మనది. ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాలు డబ్బు, హోదా లతో కొలవబడుతున్న వేళ.. కులమతాలకు అతీతంగా, స్వార్థం లేని ప్రేమకు, రక్షణకు ప్రతీకగా నిలిచే ఏకైక పండుగ ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
అనుబంధాలకు అద్దం పట్టే పండుగ
- ఎల్. రమాదేవి, రాజన్న ఆలయ ఈవో, వేములవాడ
అనుబంధాలకు అద్దం పట్టే అపురాపమైన ఏకైక పండుగ రాఖీ. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ కోసం ఎదురు చూస్తాను. నాకు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. మరొకరు ఇక్కడే ఉండటంతో ప్రతి సంవత్సరం పోస్టు ద్వారా ఇద్దరి సోదరులకు రాఖీ పంపిస్తాను. మరో సోదరుడికి నేరుగా వెళ్లి రాఖీ కట్టి వస్తాను. రాఖీ పండుగ రోజు మా కుటుంబంలోని అందరం ప్రేమానురాగాలను పంచుకుంటూ గడుపుతాం.
అన్నాచెల్లెళ్ల బంధం గుండెతో ముడిపడి వుంది
- డాక్టర్. హారిక, గైనకాలజిస్ట్, వేములవాడ
అన్నాచెల్లెళ్ల బంధం అంటే రక్తంతో ముడిపడినది కాదు. గుండెతో ముడిపడి ఉంది. ఏడేడు జన్మల బంధాన్ని ముడివేసే గొప్ప పండుగ రాఖీ పౌర్ణమి, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నేను ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా మా తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఒక్క రోజు ముందే కరీంనగర్ చేరుకుంటాను. కుటుం బంతో సరదాగా గడుపుతాను.
రక్షాబంధన్ విలువ నాకు తెలుసు
- తుల ఉమ, మాజీ జడ్పీచైర్‌పర్సన్
చిన్నప్పటి నుంచి రక్షాబంధన్ అంటే నాకు ఒక ప్రత్యేకం. రాఖీ పౌర్ణమి విలువ నాకు తెలుసు. నాకు స్వంత సోదరులు లేరు. పెద్ద నాన్న కుమారులకు రాఖీ కట్టేదాన్ని. ప్రతి సంవత్సరం కేసీఆర్‌కు రాఖీ కట్టేదాన్ని. ఈ సంవత్సరం కూడా కట్టేందుకు ప్రయ త్నం చేస్తాను. బోయినపల్లి వినోద్‌కుమార్, హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్‌లకు ప్రతి సంవత్సరం రాఖీ కడుతాను.