Share News

ఆర్‌పీజీ యాక్టివ్‌ ఫార్మా చేతికి రాఘవ లైఫ్‌ సైన్సెస్‌

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:06 AM

హైదరాబాద్‌ ఫార్మా రంగం లో మరో టేకోవర్‌ చోటు చేసుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రాఘవ లైఫ్‌ సైన్సెస్‌ కు చెందిన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ), ఇంటర్మీడియట్స్‌ వ్యాపారాన్ని ఆర్‌పీజీ గ్రూప్‌ కొనుగోలు చేస్తోంది.

ఆర్‌పీజీ యాక్టివ్‌ ఫార్మా చేతికి రాఘవ లైఫ్‌ సైన్సెస్‌
RPG Group

  • డీల్‌ విలువ రూ.135 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ ఫార్మా రంగం లో మరో టేకోవర్‌ చోటు చేసుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రాఘవ లైఫ్‌ సైన్సెస్‌ కు చెందిన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ), ఇంటర్మీడియట్స్‌ వ్యాపారాన్ని ఆర్‌పీజీ గ్రూప్‌ కొనుగోలు చేస్తోంది. ఆర్‌పీజీ గ్రూప్‌ ప్రధాన ఫార్మా కంపెనీ ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ (ఆర్‌పీజీఎల్‌ఎస్ఎల్‌) తన అనుబంధ సంస్థ ఆర్‌పీజీ యాక్టివ్‌ ఫార్మా లిమిటెడ్‌ (ఆర్‌పీజీఏపీ) రూ.135 కోట్లకు ఈ కొనుగోలు చేస్తోంది. ఆస్తులు, అప్పులతో కలిపి యథాతథ స్థితిలో ఈ కొనుగోలు చేస్తున్నట్టు ఆర్‌పీజీఎల్‌ఎస్ఎల్‌ తెలిపింది.


రెండో కొనుగోలు: గడిచిన రెండు నెలల్లో ఆర్‌పీజీ యాక్టివ్‌ ఫార్మా చేపట్టిన రెండో కొనుగోలు ఇది. నెల రోజుల క్రితమే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న మరో ఏపీఐ తయారీ సంస్థ యాక్టిస్‌ జెనరిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. తాజాగా రాఘవ లైఫ్‌ సైన్సె్‌సకు చెందిన ఏపీఐ, ఇంటర్మీడియట్స్‌ వ్యాపారాల కొనుగోలుతో మరో 29 కీలక ఏపీఐ రసాయనాలు (మాలిక్యూల్స్‌) ఆర్‌పీజీకి అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్‌ సమీపంలో వీటిని ఉత్పత్తి చేసే రాఘవ లైఫ్‌ సైన్సెస్‌ ప్లాంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)- జీఎంపీ, ఈయూ-జీఎంపీ నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో మరింతగా దూసుకుపోవచ్చని ఆర్‌పీజీ యాక్టివ్‌ ఫార్మా భావిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జియో కొత్త ఆఫర్‌.. పాత కంప్యూటర్‌ ఇకపై కొత్త దానిలా..

ప్రవాసుల నిధుల వెల్లువ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 01:06 AM