మూడో రోజూ నష్టాలే...
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:56 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పెరిగిన ముడిచమురు ధరలు, అంతర్జాతీయ ఈక్విటీల్లో బేరిష్ ట్రెండ్ నేపథ్యంలో...
374 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పెరిగిన ముడిచమురు ధరలు, అంతర్జాతీయ ఈక్విటీల్లో బేరిష్ ట్రెండ్ నేపథ్యంలో వరుసగా మూడో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుధవారం బీఎ్‌సఈ సెన్సెక్స్ 373.93 పాయింట్ల నష్టంతో 76,570.35 పాయింట్ల వద్దకు జారుకుంది. నిఫ్టీ 141.35 పాయింట్ల నష్టంతో 23,914.45 పాయింట్ల వద్దకు పడిపోయింది. ఆటో, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది.
మరింత తగ్గిన బంగారం ధర: బంగారం ధరలు వరుసగా ఆరో రోజూ తగ్గాయి. ఢిల్లీ మార్కె ట్లో బుధవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.2,100 తగ్గి 1,56,100కు చేరుకుంది. ఈ ధర దాదాపు మూడు వారాల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఆరు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర రూ.11,000 మేర తగ్గింది. వెండి ధర వరుసగా రెండో రోజూ తగ్గింది. కిలో వెండి రూ.5,000 తగ్గి రెండు వారాల కనిష్ఠ స్థాయి రూ.2,35,500 వద్దకు చేరింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..