ఎన్‌విడియా గూటికి హగ్గింగ్ ఫేస్ స్టార్టప్
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:25 AM
అమెరికా టెక్ దిగ్గజం ఎన్‌విడియా తన కొనుగోళ్ల పర్వం కొనసాగిస్తోంది. తాజాగా కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ సంస్థ హగ్గింగ్ ఫేస్‌ను 1,293 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.22 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది.
డీల్ విలువ రూ.1.22 లక్షల కోట్లు
న్యూయార్క్: అమెరికా టెక్ దిగ్గజం ఎన్‌విడియా తన కొనుగోళ్ల పర్వం కొనసాగిస్తోంది. తాజాగా కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ సంస్థ హగ్గింగ్ ఫేస్‌ను 1,293 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.22 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది. ఎన్‌విడియా చీఫ్ జెన్‌సెన్ హుయాంగ్ తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయం ప్రకటించారు. ఫ్రాన్స్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు క్లెమెంట్ డిలాంగ్యు, జులియన్ చామాండ్, థామస్ వోల్ఫ్ 2016లో ఈ ఏఐ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. హగ్గింగ్ ఫేస్ స్టార్టప్.. ఓపెన్ మోడల్ డెవలపర్ కమ్యూనిటీకి అద్భుతమైన వేదిక అని ఎన్‌విడియా చీఫ్ తన పోస్టులో పేర్కొన్నారు. 30 లక్షలకుపైగా మోడల్స్, ఐదు లక్షల డేటాసెట్స్, 10 లక్షల అప్లికేషన్లను షేర్ చేసేందుకు 180 లక్షల మందికి పైగా డెవలపర్లు, పరిశోధకులు, క్రియేటర్లు హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్‌పీజీ యాక్టివ్ ఫార్మా చేతికి రాఘవ లైఫ్ సైన్సెస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News