Share News

జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:18 AM

ఈ ఏడాది ఆగస్టులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14.8 శాతం వృద్ధితో దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ కార్యకలాపాలు,...

జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు

ఆగస్టులో 15 శాతం వృద్ధి నమోదు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14.8 శాతం వృద్ధితో దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ కార్యకలాపాలు, దిగుమతుల జోరు ఇందుకు దోహదపడింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆగస్టులో దేశీయ కార్యకలాపాలపై జీఎస్‌టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9.3 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరగా... దిగుమతులపై పన్ను రాబడి 29 శాతం వృద్ధితో రూ.62,604 కోట్లకు చేరుకుంది. దీంతో, జీఎ్‌సటీ స్థూల ఆదాయం రూ.1,99,853 కోట్లుగా నమోదైంది. అందులో సెంట్రల్‌ జీఎస్‌టీ వాటా రూ.38,413 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ వాటా రూ.46,316 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రాబడి రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. ఆగస్టులో జీఎ్‌సటీ రిఫండ్లు 68 శాతం పెరిగి రూ.31,795 కోట్లకు పెరిగాయి. దాంతో జీఎస్‌టీ నికర ఆదాయం రూ.1.68 లక్షల కోట్లుగా నమోదైంది.

తెలంగాణ జీఎస్‌టీ రాబడిలో 17% వృద్ధి: ఈ ఆగస్టులో తెలంగాణ జీఎస్‌టీ రాబడి (ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్‌ అనంతరం) వార్షిక ప్రాతిపదికన 17 శాతం వృద్ధితో రూ.4,550 కోట్లకు చేరింది. గత ఏడాదిలో ఇదే నెలకు ఆదాయం రూ.3,875 కోట్లుగా ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 05:19 AM