కుదేలైన స్టాక్ మార్కెట్లు.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:54 PM
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ద ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 75 వేల పాయింట్ల దిగువకు పతనమై.. ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడోరోజూ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 1,400 పాయింట్లకుపైగా పతనమై 75వేల దిగువకు చేరింది. నిఫ్టీ కూడా దాదాపు 430 పాయింట్ల మేర క్షీణించింది. మార్కెట్లు డీలా పడటంతో మదుపర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది.
శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి సెన్సెక్స్ 1,439 పాయింట్ల నష్టంతో 74,592 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 480 పాయింట్ల మేర పడిపోయి 23,154 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, ట్రెంట్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, బీఈఎల్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు రూపాయి విలువ కూడా భారీ స్థాయిలో క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.47 వద్ద తచ్చాడుతోంది.
ఇవీ చదవండి:
సన్‌రైజర్స్‌లోకి పాక్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం
రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్